బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న శ్రీముఖిపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. నాగార్జున ఆమెని ఒక్క మాట కూడా అనకపోవడం, షోలో ఆమె నెగెటివ్ యాంగిల్ కనిపించకుండా కూడా ఎడిట్ చేస్తున్నారని ఇలా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ విషయాలను ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురిస్తూ శ్రీముఖిని నెగెటివ్ యాంగిల్ లో ప్రొజెక్ట్ చేసింది. దీంతో నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారని ప్రముఖ ఆంగ్ల దినపత్రికపై శ్రీముఖి బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.

శ్రీముఖిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం నిర్వహిస్తోందని వారు ఆరోపణలు చేస్తున్నారు. ట్విట్టర్ నకిలీ అకౌంట్లను పరిగణలోకి తీసుకొని ఆ పత్రిక వార్తలు రాస్తూ శ్రీముఖిపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత రెండు వారాల నుండి ఈ వార్తలు మరింత ఎక్కువగా వస్తుండడంతో కంప్లైంట్ ఇవ్వక తప్పలేదని అన్నారు.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ప్రసారమైన బిగ్ బాస్ ఎపిసోడ్ లో శ్రీముఖి.. రాహుల్ ని ఉద్దేశిస్తూ బ్లాక్ షీప్ అని కామెంట్ చేసింది. ఇది వర్ణ వివక్ష అంటూ నెటిజన్లు శ్రీముఖిపై మండిపడుతున్నారు. ఈ విషయంలో నాగార్జున గనుక శ్రీముఖిని దండించకపోతే షోపై నెగెటివ్ ఫీలింగ్ కలిగే ప్రమాదం ఉంది.