Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళంలో టెన్షన్, అజ్ఞాతం వీడని కూన రవికుమార్: పోలీసుల వేట, రిమాండ్ కు అనుచరులు

బుధవారం రాత్రి శ్రీకాకుళం శాంతినగర్‌ కాలనీలోని మాజీ విప్‌ కూన రవికుమార్‌ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. సోదాలు నిర్వహించేందుకు ప్రయత్నించగా కూన రవికుమార్ భార్య ప్రమీల వారిని అడ్డుకున్నారు. వారెంట్‌ లేకుండా ఇంటిని ఎలా సోదాలు చేస్తారంటూ నిలదీయడంతో పోలీసులు వెనుదిరిగారు. 

tension situation at srikakulam district over ex govt whip kuana ravikumar issue
Author
Srikakulam, First Published Aug 29, 2019, 8:33 AM IST

శ్రీకాకుళం: మాజీ ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ ఇంకా అజ్ఞాతం వీడలేదు. తన అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏక్షణమైనా కూన రవికుమార్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలియడంతో శ్రీకాకుళం జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. 

తనను మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమారర్ దూషించారంటూ బుజ్జిలి ఎంపీడీవోదామోదరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూన రవికుమార్ తోపాటు 11 మంది టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 10 మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి ఆముదాలవలస కోర్టులో హాజరుపరిచారు. వారందరికి జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.జ్యోత్స్న సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించారు. 

మరోవైపు కూన రవికుమార్ అరెస్ట్ పై శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూనను అరెస్ట్ చేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. గాలింపు చర్యలు చేపడుతున్నారు. కూన రవికుమార్ బంధువుల గురించి ఆరా తీస్తున్నారు.  

కూన రవికుమార్ అరెస్ట్ అవుతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆముదాలవలస పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు.  

ఇకపోతే బుధవారం రాత్రి శ్రీకాకుళం శాంతినగర్‌ కాలనీలోని మాజీ విప్‌ కూన రవికుమార్‌ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. సోదాలు నిర్వహించేందుకు ప్రయత్నించగా కూన రవికుమార్ భార్య ప్రమీల వారిని అడ్డుకున్నారు. వారెంట్‌ లేకుండా ఇంటిని ఎలా సోదాలు చేస్తారంటూ నిలదీయడంతో పోలీసులు వెనుదిరిగారు. 

ప్రమీల అడ్డుకోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ టీఎఫ్‌ బృందాలతోపాటు ఇంటి గేటు వద్ద ఒక ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, మహిళా హోంగార్డు పికెటింగ్‌ కోసం ఏర్పాటు చేశారు.  

ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. స్పీకర్‌ చెప్పినట్టే పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. రాత్రి వేళల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తారా అంటూ మండిపడుతున్నారు.  

స్పీకర్‌ ఢిల్లీలో ఉన్నప్పటికీ ఆయన భార్య అధికారులపై ఒత్తిడి తెచ్చి తమను వేధిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని నిలదీస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారంటూ కూన రవికుమార్ భార్య ప్రమీల ఆరోపించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్దం

టీడీపీ నేతలకు కేసుల ఉచ్చు: కోడెలతో మొదలు పెట్టి...

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్: పోలీసుల గాలింపు

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ

Follow Us:
Download App:
  • android
  • ios