ఏపీకి కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ : మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 16, 2019, 6:32 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

సినిమాలో విలన్: బాబుపై వైఎస్ జగన్ నిప్పులు

కాపులకు రిజర్వేషన్లు  ఇస్తామని మోసం చేసినందునే  మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని  ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీపై విమర్శలు గుప్పించారు.  చంద్రబాబును చూస్తే సినిమాలో విలన్ క్యారెక్టర్ గుర్తుకు వస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

 

 

నాది మోసమైతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిది దగా: కాపు రిజర్వేషన్లపై బాబు


కాపులకు రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మంగళవారం నాడు తీవ్ర వాగ్వాదం జరిగింది.  వైఎస్ఆర్‌ కూడ కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని  చంద్రబాబు గుర్తు చేశారు.
 

 

కలెక్టర్ సీరియస్:నారాయణఖేడ్‌లో సినీ హీరో మంచు మనోజ్‌కు ఓటు (వీడియో)

నారాయణఖేడ్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ మున్సిపాటిలీ పరిధిలో సినీ నటుడు మంచు మనోజ్ పేరుతో ఓటు హక్కునమోదైంది.  హైద్రాబాద్ ‌లో నివాసం ఉండే సినీ నటుడు మంచు మనోజ్ పేరుతో నారాయణఖేడ్‌లో ఓటు హక్కు నమోదు కావడంపై బీజేపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై   కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

 

జగన్ తో పనిసేందుకు కేంద్రం సుముఖం: దగ్గుబాటి పురంధీశ్వరి

ఏపీలో వలసలు కొనసాగుతాయని పురంధీశ్వరి స్పష్టం చేశారు. బీజేపీలో చేరేందుకు అన్ని పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రతీ పౌరుడు అర్థం చేసుకుంటున్నారని అందుకే బీజేపీకి ఇంత ఆదరణ లభిస్తోందని పురంధీశ్వరి చెప్పుకొచ్చారు.

 

ఏ తలపెట్టుకుని మాట్లాడతావ్, మోసం చేసి రాజకీయమా: చంద్రబాబుపై బొత్స ఫైర్

రాష్ట్ర విభజన తర్వాత అన్ని రంగాలను మోసం చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సీనియర్ నేతగా ఒక హుందాగా నడుచుకోవాలని లేనిపక్షంలో ప్రజలు చీత్కరించుకునే పరిస్థితికి దిగజారొద్దని బొత్స సత్యనారాయణ సూచించారు.   

 

బోర్డర్ లైన్ దాటుతున్నారు, ఇక సహించం: అచ్చెన్నాయుడుకు అంబటి వార్నింగ్

అసెంబ్లీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు బోర్డర్ లైన్ దాటుతున్నారంటూ విమర్శించారు. ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడితే ఊరుకునేది లేదన్నారు. స్పీకర్ గా అవసరమైతే అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. 
 

లంచం లేకుండా పనులు జరుగుతున్నాయా: ప్రశ్నించిన జగన్

లంచం లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రజలు విశ్వాసాన్ని పెంచుకొనేలా పనిచేయాల్సిన అవసరం ఉందని  ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

 

నేను వెళ్తే ప్రధానిని చేయరు కదా: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రశ్నించే గొంతుగా ప్రజలు తనను పార్లమెంటుకు పంపించారని ప్రజల తరఫున ప్రజా సమస్యలపై మాట్లాడమని, ప్రజల సమస్యలు వినిపించమని పార్లమెంటుకు పంపించారన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్ లో వినిపిస్తానని అంతే తప్ప వేరే ఆలోచన చేయబోనని స్పష్టం చేశారు. అంతేకాదు భవిష్యత్‌లో కూడా ఇలాంటి చిల్లర మల్లర ప్రచారాలు చేస్తే నమ్మెద్దంటూ కార్యకర్తలకు హితవు పలికారు రేవంత్ రెడ్డి. 

 

ప్రియుడితో రాసలీలలు: కూతురిని చిత్రహింసలు పెట్టిన తల్లి

ఖమ్మం: సహాజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి కన్నతల్లి కూతురికి వాతలు పెట్టింది. ఈ ఘటనపై బాధితురాలు స్కూల్ ప్రిన్సిఫల్  సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 

రామ్ చరణ్ సంచలన నిర్ణయం!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకుంటాడు. ఏడాదికి తను నటించిన ఒక్క సినిమాఅయినా రిలీజ్ అవ్వాలనేది చరణ్ ఆలోచన. గతంలో 'మగధీర' సినిమాకి ఎక్కువ సమయం పడుతోంది అసహనానికి గురయ్యాడు.

 

సిగరెట్ సీన్స్ పై ట్రోల్స్.. స్పందించిన రకుల్!

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తోన్న చిత్రం 'మన్మథుడు 2'. ఈ సినిమాలో కీర్తి సురేష్, అక్షర గౌడ వంటి తారలు స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. 

 

పది రోజులకు ఎంత అడిగిందో తెలుసా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఆమెకున్న క్రేజ్ బట్టి రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తోంది ఈ బ్యూటీ.

 

ప్రేమను నిరూపించుకోవడానికి చంపాడేమో.. తాప్సీ కామెంట్స్!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి తన పోస్ట్ తో చురకలంటించింది హీరోయిన్ తాప్సీ. సోమవారం నాడు మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా సంచనలం సృష్టించింది. \

 

ఆడపిల్లననే జాలి కూడా లేదు.. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.. నటి గీతా సింగ్!

హాస్య నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది గీతా సింగ్. పలు చిత్రాల్లో కామెడీ రోల్స్ చేసిన గీతా సింగ్ కితకితలు చిత్రంలో పూర్తిస్థాయి పాత్రలో అలరించింది.

 

నాగార్జునకి తలనొప్పి.. హైకోర్టుకి బిగ్ బాస్ టీమ్!

మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న బిగ్ బాస్ సీజన్ 3 షోని వివాదాలు చుట్టుముట్టాయి. బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తాలు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. దీంతో బిగ్ బాస్ టీమ్ హైకోర్టుని ఆశ్రయించింది.

 

 

ఆ సీక్వెల్ కోసం 8 కథలు రిజెక్ట్ చేసిన చిరు.. దర్శకుడు అతడే!

మెగాస్టార్ నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సీక్వెల్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. 

 

 

తండ్రిగా మాత్రమే గెలిచా...కానీ ఓ పౌరుడిగా మాత్రం ఓడిపోయా: స్టోక్స్ తండ్రి గెరార్డ్

ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై చెలరేగిన ఇంగ్లాండ్ జట్టును గెలిపించి బెన్ స్టోక్స్ హీరో అయ్యాడు. అతడిపై ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెట్ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ అతడి కుటుంబం పరిస్థితి మాత్రం చాలా  విచిత్రంగా తయారయ్యింది. 

 

 

కేంద్రమంత్రులపై మోదీ ఆగ్రహం, లిస్ట్ తయారు చేయమని ఆదేశం

కనీసం పార్లమెంట్ సమావేశాలకు కూడా మంత్రులు హాజరుకావడం లేదంటూ మోదీ విరుచుకుపడ్డారు. ఆయా శాఖలపై మంత్రులు ఇప్పటికీ పట్టు సాధించకపోవడంపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సమావేశాలకు రాని కేంద్రమంత్రుల జాబితా తయారు చేయాలంటూ మోదీ ఆదేశించారు. 

 

 

సచిన్ వరల్డ్ కప్ జట్టు.. ధోనికి దక్కని చోటు

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన వరల్డ్ కప్ జట్టును ప్రకటించారు. క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ క్రికెట్ జట్టును సీనియర్ క్రికెటర్లు ప్రకటించడం మనకు తెలిసిన విషయమే.  వరల్డ్ కప్ మొదలు కాకముందు  చాలా మంది దిగ్గజ క్రికెటర్లు తమ అభిమాన జట్టు ఇదే అంటూ ప్రకటించగా... తాజాగా సచిన్ ప్రకటించారు.

 

 

150 సంవత్సరాల తర్వాత నేడు అరుదైన చంద్రగ్రహణం

నేడు చంద్ర గ్రహణం. అయితే... ఈ చంద్ర గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు 150 సంవత్సరాల తర్వాత ఇలాంటి చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. 150 సంవత్సరాల తర్వాత ఆషాఢ పౌర్ణమి అంటే గురుపౌర్ణమి రోజున తొలిసారిగా ఈ చంద్రగ్రహణం వస్తోంది

 

 

గ్రహణం రోజు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గ్రహణ సమయంలో తర్పణం వదిలే అధికారం ఉన్నవారు మాత్రం పితృదేవతలకు తిల తర్పణం ఇవ్వాలని నియమం  ఉన్నది. తర్పణం ఇచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు.

click me!