అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తోన్న చిత్రం 'మన్మథుడు 2'. ఈ సినిమాలో కీర్తి సురేష్, అక్షర గౌడ వంటి తారలు స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. 

ఆగస్ట్ 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై మంచి టాక్ ని దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా.. రకుల్ కోసం స్పెషల్ గా ఓ టీజర్ ని వదిలింది చిత్రబృందం.

సినిమాలో రకుల్ పాత్రలో రెండు కోణాలుంటాయి. టీజర్ లో ఓ సీన్ లో రకుల్ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తుంది. ఈ సీన్లు చూసిన నెటిజన్లు మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆమెను ట్రోల్ చేశారు.

తాజాగా ఈ విషయంపై రకుల్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ని ఈ విషయమై స్పందించగా.. ''జనాల పనే చెప్పడం.. వాళ్లు ఏదోకటి చెబుతూనే ఉంటారు'' అంటూ అసహనం వ్యక్తం చేసింది.