లంచం లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రజలు విశ్వాసాన్ని పెంచుకొనేలా పనిచేయాల్సిన అవసరం ఉందని  ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

అమరావతి: లంచం లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రజలు విశ్వాసాన్ని పెంచుకొనేలా పనిచేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.

స్పందన కార్యక్రమంపై మంగళవారం నాడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు వచ్చిన స్పందన కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. 

ఈ సమీక్షలో పలు అంశాలపై జగన్ కలెక్టర్లు,ఎస్పీలను ప్రశ్నించారు. అవినీతిపై కలెక్టర్లను సూటిగా సీఎం జగన్ ప్రశ్నించారు. ఎమ్మార్వో, పోలిస్‌స్టేషన్లలో అవినీతి లేదనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ అవినీతి లేదని ధైర్యంగా చెబుతారా అని ఆయన అడిగారు.

అవినీతిని తాను సహించబోనని జగన్ మరోసారి స్పష్టం చేశారు. అవినీతికి దూరంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. లంచం లేకుండా పనుులు జరుగుతున్నాయని ప్రజలు విశ్వాసం పొందేలా పనులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.