టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఆమెకున్న క్రేజ్ బట్టి రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తోంది ఈ బ్యూటీ.

దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తోన్న 'వాల్మీకి' సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పూజాహెగ్డేని తీసుకున్నారు. నిజానికి హీరోయిన్ రోల్ కంటే స్పెషల్ రోల్ అని చెప్పడం బెటర్. ఎందుకంటే ఈ సినిమాలో ఆమెకి సంబంధించి ఒక పాట, కొన్ని సీన్లు మాత్రమే ఉంటాయి.

ఆమె కాల్షీట్స్ కూడా కేవలం పది రోజులు మాత్రమే అడిగారు. చిన్న రోల్ అయినప్పటికీ హరీష్ శంకర్ తో ఉన్న అనుబంధం కారణంగా పూజా ఓకే చెప్పేసింది. కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అమ్మడు రాజీ పడడం లేదు. తన రెమ్యునరేషన్, ఇతర ఖర్చులు, స్టాఫ్ ఖర్చు మొత్తం కలిపి పది రోజులకు కోటిన్నర డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఆమెకున్న క్రేజ్ కారణంగా అడిగినంతా ఇచ్చి ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు  తీసుకురానున్నారు.