అమరావతి: అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వింతగా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

స్పీకర్ ను బెదిరించేలా మాట్లాడుతున్నారు, సభానాయకుడు మాట్లాడుతుంటే అడ్డుతగులుతూ సభకు అడ్డు తగులుతున్నారంటూ విరుచుకుపడ్డారు. మైక్ ఇవ్వకపోయినా మాట్లాడతారు అంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు సభలో ప్రవర్తిస్తే అది మంచి పద్ధతి కాదంటూ హెచ్చరించారు. 

వెంట్రులాజికమ్ షోలోలా చంద్రబాబు అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వెంట్రులాకిస్ట్ అయితే అచ్చెన్నాయుడు బొమ్మ అంటూ వ్యాఖ్యానించారు.  

అసెంబ్లీలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు బోర్డర్ లైన్ దాటుతున్నారంటూ విమర్శించారు. ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడితే ఊరుకునేది లేదన్నారు. స్పీకర్ గా అవసరమైతే అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు.