గ్రహణ సమయంలో తర్పణం వదిలే అధికారం ఉన్నవారు మాత్రం పితృదేవతలకు తిల తర్పణం ఇవ్వాలని నియమం  ఉన్నది. తర్పణం ఇచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు.

గ్రహణపు వైజ్ఞానిక అర్థాన్ని తెలుసుకోలేక ఈ రోజుల్లో గ్రహణాచారాలను చాలామంది వదిలేసారు. దీని ఫలితంగా కాలాంతరంగా చాలా దీర్ఘకాలిక రోగాలు వానిలో మూత్రకోశం, హృదయం, మెదడు వీనికి సంబంధించిన మానసిక రోగాలు వచ్చిచాలా నరక యాతనను అనుభవించవలసి రావచ్చును. దీని వలన తీసుకునే ఆహారం కన్నా మందుల వాడకమే అధికంగా ఉన్నది. అదే సర్వసామాన్యమై ఉన్నది.

1. గ్రహణ సమయంలో గృహంలోని ఆహార పదార్థాలు అనగా పచ్చళ్ళు, ఊరగాయలు మొదలైన వానిపై కొంత దర్భను వేయటంచే గ్రహం దోషం నివారణ జరుగుతుంది. ఇది మూఢనమ్మకమని తీసి పారేయరాదు. దర్భకు గ్రహణముల ద్వారా వచ్చే నెగివ్‌ ఎనర్జీని తీసివేసే శక్తి కలిగి ఉన్నది. ప్రకృతి సహజంగా లభించినది. ఏవో రెండు మూడు దర్భ పుల్లలు తీసుకొచ్చి వేయడం కాదు. తినే పదార్థాలన్నీ దర్భలతో కప్పి ఉంచాలి. ఆ వ్యతిరేక శక్తి రాకుండా ఉండడానికి.

కొందరికి అనుమానం కలుగవచ్చు. మనం తలుపులు వేసుకుని ఉన్నాం ఆ వ్యతిరేక కిరణాలు ఎలా వస్తాయి? అని మనం ఎంత తలుపు వేసుకుని ఉన్నా కానా గాలి అనేది అన్నిచ్లోటా వ్యాపించి ఉంటుంది. ఆ సమయంలో వీచే గాలి గ్రహణపు ప్రభావానికి లోనై ఉంటుంది.

గ్రహణ సమయంలో సూర్యుడు లేక చంద్రుని నుంచి బహిర్గతమయ్యే ఆకర్షణశక్తి ప్రభావం వికరణం చెందడం వలన భూమిపై ఉన్న చరాచర వస్తువుల మీద ఆ శక్తి ప్రభావం ప్రసారమౌతుంది. ఈ వికరణ ప్రభావం మనుషులపై జంతువులపైన, అలాగే పంట పొలాలపై కూడా పడుతుంది. వికిరణంచే ఏర్పడిన శక్తిని మనం ఆహార పదార్థాలపైననే గాక మనం వేసుకునే వస్త్రాలపై కూడా పడుతుంది. దీని వలన ముందుగా శారీరక అనారోగ్యం వస్తుంది.

2. గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో ఇంటిలోనే ఉండవలెను. అలా కాకుండా గ్రహణాన్ని చూస్తామని చూసినా, ఆ ఎఫెక్ట్‌ వారి శరీరంలో ఉండే పిండంపై పడుతుంది. ఆ పిండం అంగవైకల్యంగా పుడుతుంది. ఇది మూఢ నమ్మకం అనుకుటాంరు కాని కాదు. గర్భంలో ఉండే పిండం చాలా లేతగా మొత్తం ఎనర్జీ లేకుండా ఉంటుంది.

ఆ సమయంలో ఏ వ్యతిరేక ప్రభావం అయినా ఎక్కువగా గ్రహించుకునే శక్తిని కలిగి ఉంటుంది. మంచిని అంతే తొందరగా గ్రహిస్తుంది. చెడును కూడా అంతే  తొందరగా గ్రహిస్తుంది. కావున గర్భిణిలు ఆ సమయంలో గృహము వద్దనే ఉండాలి. గ్రహణ సమయంలో జంతువులు కూడా ఏవీ బయటకి రావు. గ్రహణం పూర్తయ్యే సమయానికి మాత్రం కుక్కలు కాని, లేదా ఏవైనా ఒక పక్షి కాని ఆకాశంలో అలా తిరుగాడుతూ ఉంటుంది. గమనించగలరు.

గ్రహణం కనిపించినా, కనిపించక పోయినా దాని ప్రభావం మాత్రం ప్రకృతిపై తప్పనిసరిగా ఉండి తీరుతుంది. కావున ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈసారి గ్రహణం ధనుస్సు మకర రాశులలో వస్తుంది. ఈ రాశుల వారు గర్భిణీ స్త్రీలు ఉన్నట్లైతే వీరు మధ్యాహ్నం 3 లోపు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. తరువాత అవసరమైతే ద్రవ పదార్థాలు తీసుకోవచ్చును. కాని ఘన పదార్థాలు తీసుకోరాదు.

డా.ఎస్.ప్రతిభ