150 సంవత్సరాల తర్వాత నేడు అరుదైన చంద్రగ్రహణం
నేడు చంద్ర గ్రహణం. అయితే... ఈ చంద్ర గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు 150 సంవత్సరాల తర్వాత ఇలాంటి చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. 150 సంవత్సరాల తర్వాత ఆషాఢ పౌర్ణమి అంటే గురుపౌర్ణమి రోజున తొలిసారిగా ఈ చంద్రగ్రహణం వస్తోంది
నేడు చంద్ర గ్రహణం. అయితే... ఈ చంద్ర గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు 150 సంవత్సరాల తర్వాత ఇలాంటి చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. 150 సంవత్సరాల తర్వాత ఆషాఢ పౌర్ణమి అంటే గురుపౌర్ణమి రోజున తొలిసారిగా ఈ చంద్రగ్రహణం వస్తోంది. గతంలో 1870వ సంవత్సరం జులై 12న గురుపౌర్ణమి రోజు ఇదేవిధంగా చంద్ర గ్రహణం ఏర్పడింది.
ఈ రోజు రాత్రి ఏర్పడే చంద్రగ్రహణం..ఉత్తరాషాఢ నక్షత్రం తొలిపాదంలో ఏర్పడి, రెండో పాదంలో ముగుస్తుంది. అంటే అర్థరాత్రి 1.30 నిమిషాలకు ధనుస్సు రాశిలో ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం, తెల్లవారుజామున 4.31 నిమిషాలకు మకర రాశిలో ముగుస్తుంది. మొత్తం 178 నిమిషాల పాటు ఉండే ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే మనకు కనిపిస్తుంది.
గ్రహణం రోజు పాటించాల్సిన నియమాలు..
ఇక గ్రహణ సమయానికి సుమారు 4 గంటల ముందు అంటే రాత్రి 8 నుంచి 9 గంటల లోపే భోజనం పూర్తి చేయాలని కూడా పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా మంత్రోపదేశం తీసుకున్నవారు ఈ గ్రహణసమయంలో మంత్రానుష్టానం చేయటం ఎంతో మంచిది. ఇక గ్రహణ సమయానికి ముందు, గ్రహణం తర్వాత అంటే బుధవారం తెల్లవారుజామున గ్రహణ స్నానం చేయటం ఉత్తమం.
ఇక చంద్ర గ్రహణం సందర్భంగా పలు దేవాలయాను మంగళవారం మధ్యాహ్న పూజ తర్వాత, మరికొన్ని దేవాలయాను రాత్రి పూజ అనంతరం 9 గంటలనుంచి మూసివేయనున్నారు. తిరిగి బుధవారం ఉదయం దేవాలయను సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రబద్ధంగా నిర్వహించిన తర్వాతే తెరుస్తాయి.అప్పటివరకు ఎటువంటి పూజలు, భక్తులకు దర్శనం మొదలైనవి ఉండవు.