ఖమ్మం: సహాజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి కన్నతల్లి కూతురికి వాతలు పెట్టింది. ఈ ఘటనపై బాధితురాలు స్కూల్ ప్రిన్సిఫల్  సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వరావుపేట మండలం గాండ్లగూడెనికి చెందిన భూక్యా మంగకు గణేష్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు ఇందు ఆశ్వరావుపేట మండలంలోని అనంతారం గ్రామంలో ఐటీడీఏ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించింది. ప్రస్తుతం ఇందు ఐదో తరగతి చదువుతుంది.

రెండేళ్ల క్రితం ఇందు తండ్రి గణేష్ మృతి చెందాడు.  గణేష్ మృతి చెందిన తర్వాత భూక్యా మంగ ఏపీ రాష్ట్రంలోని  పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన భూపతిరాజు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. 

గడిచిన ఏడాది దసరా సెలవులకు ఇందు తల్లి వద్దకు వచ్చింది. అయితే భూపతిరాజుతో సహజీవనం చేయడానికి ఇందు అడ్డంకిగా నిలిచిందని భావించిన తల్లి ప్రియుడితో కలిసి ఇందుకు వాతలు పెట్టింది. చిత్రహింసలు భరించలేక చిన్నారి మూడు రోజుల క్రితం అమ్మమ్మ ఉంటున్న గాండ్లగూడెనికి పారిపోయింది.  అమ్మమ్మ ఇందును ఆశ్రమ పాఠశాలలో చేర్పించింది.

ఆశ్రమ పాఠశాలలో ఇందును చేర్పించింది. అయితే ఇందుకు టీసీ ఇప్పించాలని  మంగ ప్రియుడు స్కూల్ ప్రిన్సిపల్ పై ఒత్తిడి తీసుకొచ్చాడు.  అయితే ఈ సమయంలో అతడితో వెళ్లేందుకు ఇందు ఒప్పుకోలేదు. 

 తన తోటి విద్యార్ధినులకు అసలు విషయాన్ని బాధితురాలు చెప్పింది.  విద్యార్థినులు  ప్రిన్సిపల్ కు ఈ విషయాన్ని తీసుకొచ్చారు.  స్కూల్ ప్రిన్సిపల్ స్థానికుల సహాయంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.