టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకుంటాడు. ఏడాదికి తను నటించిన ఒక్క సినిమాఅయినా రిలీజ్ అవ్వాలనేది చరణ్ ఆలోచన. గతంలో 'మగధీర' సినిమాకి ఎక్కువ సమయం పడుతోంది అసహనానికి గురయ్యాడు.

గ్యాప్ ఎక్కువ వచ్చినందుకు అభిమానులకు సారీ కూడా చెప్పాడు. చాలా కాలం వరకు అలాంటి సినిమాల జోలికి వెళ్లలేదు. మళ్లీ ఇంతకాలానికి రాజమౌళితోనే 'RRR' సినిమా చేస్తున్నాడు చరణ్. దీనికి చరణ్ ఏడాదిన్నర సమయం కేటాయించాడు.

ఈ సినిమా రిలీజ్ తరువాత తన మార్కెట్ పెరిగినా.. ఇప్పట్లో భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లనని అంటున్నాడు చరణ్. ఒక్కో సినిమాకు రెండేళ్ల సమయం తీసుకుంటే అభిమానులకు ఎదురుచూపులు తప్పవని, అంతేకాకుండా టాలీవుడ్ మార్కెట్ కి అన్యాయం జరుగుతుందని చరణ్ భావిస్తున్నాడు. 

అందుకే ఏడాదికి తను నటించిన ఒక్క సినిమా అయినా రిలీజ్ కావాలని చరణ్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఇప్పట్లో మరో భారీ బడ్జెట్ సినిమా చేయకూడదని చరణ్ భావిస్తున్నాడు. మరో ఐదారేళ్ల తరువాత అటువంటి సినిమాల గురించి ఆలోచిస్తానని అంటున్నాడు. ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచన ఉన్నా.. ఏళ్ల తరబడి వాటి కోసం సమయం ఇవ్వడమైతే కుదరదని చెప్పేస్తున్నాడు.