న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మంత్రులపై ప్రధాని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా మంత్రుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుమారు రెండు నెలలు దగ్గర కావస్తున్నా ఇప్పటికీ శాఖలపై పట్టు సాధించకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. 

ఇలా పనిచేస్తే ఎలా అంటూ నిలదీశారు. కనీసం పార్లమెంట్ సమావేశాలకు కూడా మంత్రులు హాజరుకావడం లేదంటూ మోదీ విరుచుకుపడ్డారు. ఆయా శాఖలపై మంత్రులు ఇప్పటికీ పట్టు సాధించకపోవడంపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సమావేశాలకు రాని కేంద్రమంత్రుల జాబితా తయారు చేయాలంటూ మోదీ ఆదేశించారు.