అమరావతి: కాపులకు రిజర్వేషన్లు  ఇస్తామని మోసం చేసినందునే  మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని  ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీపై విమర్శలు గుప్పించారు.  చంద్రబాబును చూస్తే సినిమాలో విలన్ క్యారెక్టర్ గుర్తుకు వస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్‌పై టీడిపీ చీఫ్ చంద్రబాబునాయుడు చేసిన విమర్శలపై  ఏపీ సీఎం జగన్ కౌంటరిచ్చారు. కాపుల రిజర్వేషన్ల అంశంపై తాము ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చామో ఆయన ఈ సందర్భంగా చదివి విన్పించారు.  

కాపుల రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉంటుందన్నారు.తాము అధికారంలోకి వచ్చిన తర్వాత  తమ ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపుల రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌ నివేదికను ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మంజునాథ సంతకం లేకుండానే కమిషన్ నివేదిక ఇవ్వడంలో ఏమైనా అర్ధం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

కాపులు అత్యధికంగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ ఎన్ని సీట్లను సాధించిందని ఆయన ప్రశ్నించారు.  అచ్చెన్నాయుడుకు సైజ్ అయితే ఉంది కానీ, బుర్ర పెరగలేదని జగన్ సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు

నాది మోసమైతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిది దగా: కాపు రిజర్వేషన్లపై బాబు