బాబుకు షాకిచ్చిన జగన్‌: టాప్ స్టోరీస్

By rajesh yFirst Published Jun 24, 2019, 5:59 PM IST
Highlights


నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం

ఎల్లుండి ప్రజా వేదిక భవనం కూల్చివేత: సీఎం జగన్ ఆదేశం

ప్రభుత్వంలో ఉండి  నియమ నిబంధనలకు విరుద్దంగా ఈ భవనాన్ని నిర్మించారని సీఎం జగన్ పరోక్షంగా  చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వంలో ఉంటూ ఈ రకమైన భవనాన్ని నిర్మించి ప్రజలకు ఎలా ఆదర్శంగా ఉంటారని ఆయన ప్రశ్నించారు. 
 

రహస్యంగా ఫోటోలు తీశాడని బెదిరించా.. తాప్సీ కామెంట్స్!

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తి రహస్యంగా తాప్సి ఫోటోలు తీశాడట. అది గమనించిన తాప్సి కోపంగా అతని వద్దకు వెళ్లి ఫోన్ లోపల పెడతావా..? లేక పగలగొట్టనా..? అని బెదిరించిందట.
 

ప్రాజెక్టు కోసం నా తల్లి భూమి పోగొట్టుకుంది.. కేటీఆర్

మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో తన తల్లి కూడా భూమిని పోగొట్టుకుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. త్వరలోనే సిరిసిల్లా జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 
 

జగన్ ప్లాన్: అదే నా వాంఛ, వైఎస్ఆర్‌ను మరిపిస్తారా?

అవినీతికి దూరంగా తమ సర్కార్  పాలన ఉంటుందని జగన్ సంకేతాలు ఇచ్చారు.  అంతేకాదు వైఎస్ఆర్‌ కంటే తన పాలన ఇంకా బాగుందని  ప్రజల నుండి మెప్పు పొందాలని జగన్ వాంఛగా కన్పిస్తోంది. ఈ మేరకు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు.
 

ఆధార్ తెచ్చిన తంట: పీటలపై పెళ్లి ఆపేసిన వరుడు

 మరికొద్ది నిమిషాల్లో వధువు మెడలో తాళికట్టాల్సి ఉండగా ఆధార్ కార్డులో రెడ్డి పేరు లేదంటూ వరుడి కుటుంబ సభ్యులు నానా హంగామా చేశారు.
 

బాబుకు షాక్: జనసేనలోకి వంగవీటి రాధా

వైసీపీ అధికారంలోకి రావడంతో వంగవీటి రాధా ప్రత్యామ్నాయాన్ని చూసుకొన్నారు.  ఇవాళ  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో వంగవీటి రాధా భేటీ అయ్యారు. టీడీపీని వీడి జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నందునే ఆయన పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారని  రాధా సన్నిహితులు చెబుతున్నారు.
 

ఎంతటి వాడైనా అవినీతికి పాల్పడితే సహించం: జగన్ కీలక వ్యాఖ్యలు

అవినితికి, దోచుకోవడానికి ఎమ్మెల్యేలతో పాటు ఎవరూ ముందుకు వచ్చినా కూడ తమ ప్రభుత్వం ఉపేక్షించదని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఎంతటి పెద్ద వాడైనా... ఏ స్థాయిలో ఉన్నా కూడ అక్రమాలకు, అవినీతికి, దోచుకోవడాన్ని ప్రోత్సహించబోమన్నారు.
 

బిజెపి ఆఫర్ ను తిరస్కరించిన వైఎస్ జగన్

ప్రత్యేక హోదా మాత్రమే తమ ప్రథమ ప్రాధాన్యమని, అది లేకుండా ఎన్డీఎ ప్రభుత్వం ఇచ్చే పదవులను తీసుకోవడానికి సిద్దంగా లేమని వైసిపి నాయకులు అంటున్నారు.
 

జగన్ తో మా ఎమ్మెల్యేలు టచ్ లో లేరు, అది వైసీపీ మైండ్ గేమ్: టీడీపీ నేత అనురాధ

 టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ పార్టీ వీడటం లేదని కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
 

చంద్రబాబుకు షాక్: బీజేపీలో చేరిన అంబికాకృష్ణ

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు రామ్ మాధవ్.  ఇకపోతే అంబికా కృష్ణ బీజేపీలో చేరడంతో పశ్చిమగోదావరి జిల్లాకు పెద్ద దెబ్బేనని చెప్పుకోవాలి. 
 

బీజేపీలోకి క్యూ: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచిన కమలం

ప్రధానంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై బీజేపీ అగ్రనేతలు మురళీధర్ రావు, రామ్ మాధవ్‌లు దృష్టి పెట్టారు. మురళీధర్ రావు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. రామ్ మాధవ్  ఏపీకి చెందినవాడు. ఈ ఇద్దరు నేతలు కూడ ఈ రెండు రాష్ట్రాలపై గురిపెట్టారు. ఆయా పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నిస్తున్నారు.
 

పీసీసీ చీఫ్ పగ్గాలు నాకివ్వండి, ఆ ప్లాన్ అప్లై చేస్తా : జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

 వీలుంటే తనకు పీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలో తన దగ్గర ప్లాన్ ఉందని పద్దతి ప్రకారం వెళ్లి పార్టీని బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. 
 

సానియామీర్జా కొడుకుతో ఉపాసన అల్లరి!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యారవేత్త ఉపాసన.. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కొడుకు ఇజాన్ తో సరదాగా గడిపారు. ఇజాన్ తో కలిసి ఉపాసన లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇజాన్ తో కలిసి సరదాగా ఆడుకున్నారు.
 

ఇటీవల జరిగిన 'రాజు గారి గది3' సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ఛోటా.. తమన్నాతో ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ ఈవెంట్ లో ఫోటోలకు ఫోజిచ్చే సమయంలో దూరంగా ఉన్నవాడు తమన్నా పక్కకు చేరి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు
 

అశ్వనీదత్ పై పోసాని సంచలన ఆరోపణలు!

తెలుగుదేశం పార్టీని తిట్టానని, చంద్రబాబుని విమర్శిస్తున్నాననే కారణంతో తనకు అవకాశాలు రాకుండా చేశారని.. లిస్ట్ లో తన పేరుని కూడా కొట్టేయించారని.. అలా చేసిన వ్యక్తి అశ్వనీదత్ అంటూ బాంబ్ పేల్చారు.
 

అర్జున్ రెడ్డి డైరక్టర్.. బాలీవుడ్ ఫిదా!

ఇక సందీప్ ఎలాంటి కథ రాసుకున్నా అక్కడి స్టార్ హీరోలు ఈజీగా డేట్స్ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మహేష్ తో ఒక సినిమా చేయాలనీ అనుకున్న సందీప్ కి దాదాపు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లే. మరి ఈ దర్శకుడి నెక్స్ట్ ఎటువైపు అడుగువేస్తాడో చూడాలి.   
 

నిఖిల్ కు నాలుగు కోట్ల సమస్య, తేలటం కష్టమే!

 ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే పెండింగ్ డ్యూస్ నాలుగు కోట్లు వరకూ చెల్లించారని సమాచారం. దాంతో పెద్దగా బజ్ లేని ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏ మేరకు ఆడుతుందో అని నిర్మాతలు సందేహపడుతున్నారట. మరో నాలుగు కోట్లు పెడితే అవి కూడా పోతాయని వాళ్ల సన్నిహితులు హెచ్చరిస్తున్నారట.
 

భార్యని మోసం చేశాడంటూ అల్లు బ్రదర్ పై ట్రోల్స్!

అల్లు బాబీ తనకు పెళ్లైన విషయాన్ని తెలుపుతూ కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బాబీకి గతంలో నీలిమ అనే అమ్మాయితో వివాహం జరిగింది.
 

శాటిలైట్ రైట్స్ లో సరిలేరు నీకెవ్వరు!

సరిలేరు నీకెవ్వరు సినిమా శాటిలైట్ హక్కల్ని జెమిని టీవీ సాలిడ్ రేట్ కు దక్కించుకున్నట్లు అధికార ప్రకటన వెలువడింది. మహర్షి సినిమా 16.8కోట్లకు అమ్ముడుపోగా ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో సరిలేరు నీకెవ్వరు సినిమాను జెమిని టివి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

 

సర్ఫరాజ్ ను దూషించిన పాక్ అభిమాని...మరో వీడియో విడుదల

దీంతో సర్ఫరాజ్ ను అవమానించి అభిమాని తన తప్పు తెలుసుకున్నాడు. దీంతో క్షమాపణలు చెబుతూ మరో వీడియో రూపొందించి విడుదల చేశాడు. ''స్వతహాగా పాక్ దేశీయుడినైన నేను మా క్రికెట్ జట్టు కెప్టెన్ ను అవమానించేలా మాట్లాడటం  పట్లు విచారం వ్యక్తం చేస్తున్నాను. నా వ్యవహారం, మాటలతో బాధపడ్డ సర్పరాజ్ కు క్షమాపణలు చెబుతున్నా. అలాగే ఈ వ్యవహారం మూలంగా బాధపడ్డ ప్రతి ఒక్కరిని క్షమించమని కోరుతున్నా. నేను చేసింది  ముమ్మాటికి  తప్పే... కానీ ఆ వీడియోను  సోషల్ మీడియాలో మాత్రం నేనే అప్ లోడ్ చేయలేదు. 
 

ఇమ్రాన్ ఖాన్ సరసన హారిస్ సోహైల్...సౌతాఫ్రికాపై మెరుపు ఇన్నింగ్స్ తో

మిడిల్ ఆర్డన్ లో సోహైల్ బ్యాటింగ్ కు దిగి ఎదుర్కొన్నమొదటి బంతి నుండే హిట్టింగ్ ప్రారంభించాడు. ఇలా అతడు మొత్తం 89 పరుగులు చేయగా అందులో 64 పరుగులు కేవలం బౌండరీల రూపంలో వచ్చినవే. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏం రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రపంచ కప్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పైచిలుకు పరుగులు  ( స్ట్రైక్ రేట్ ఆధారంగా) సాధించిన మూడో పాక్ ఆటగాడిగా సోహైల్ చరిత్ర సృష్టించాడు.
 

నా హ్యాట్రిక్ రహస్యమదే... ఆ సలహా అతడిదే: మహ్మద్ షమీ

ఇలా 32ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్ గా షమీ చరిత్ర సృష్టించాడు. ఇలా  అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో అరుదైన ఘనత సాధించిన షమీ ఈ క్రెడిత్ మొత్తం నా ఒక్కడిదే కాదంటూ వ్యాఖ్యానించాడు.
 

వర్షార్పణమైతే ‘శతకోట్లు’గోవిందా.. అందుకే..

ప్రపంచకప్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కు రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ప్రకటనల రెవెన్యూ వస్తుందని, దాని ఆధారంగానే సమ్‌ అష్యూర్డ్‌ ఉంటుందని బీమా పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక మ్యాచ్‌లు అయిన సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ వంటి మ్యాచ్‌లకు అడ్వర్‌టైజ్‌మెంట్‌ రెవెన్యూ రూ.70-80 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి

click me!
Last Updated Jun 24, 2019, 5:59 PM IST
click me!