రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిత్వం గలవారు. తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటాలు లేకుండా చెబుతుంటారు. కొద్దిరోజుల క్రితం ఆయనకి సర్జరీ జరిగింది. దీంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయినప్పటికీ ఓ న్యూస్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తనదైన శైలిలో మాట్లాడిన ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన.. జగన్ కి మద్దతు తెలపడం వలన సినిమా ఇండస్ట్రీలో మీరు ఒంటరి కాలేదా..? అని ప్రశ్నిస్తే.. ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

ఎన్నికలు దగ్గరకు రాగానే ఇండస్ట్రీ వాళ్లకు కోపం వచ్చిందని, తనకు అవకాశాలు తగ్గాయని అన్నారు. నిజానికి వేషాలు రాకుండా చేశారని.. తనంటే వ్యక్తిగత అభిమానం ఉన్నవారు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగుదేశం పార్టీని తిట్టానని, చంద్రబాబుని విమర్శిస్తున్నాననే కారణంతో తనకు అవకాశాలు రాకుండా చేశారని.. లిస్ట్ లో తన పేరుని కూడా కొట్టేయించారని.. అలా చేసిన వ్యక్తి అశ్వనీదత్ అంటూ బాంబ్ పేల్చారు. ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న అశ్వనీదత్ పై ఈ రకమైన ఆరోపణలు రావడం షాకింగ్ గా మారింది. మరి దీనిపై ఆయన ఎలా  స్పందిస్తారో చూడాలి!