Asianet News TeluguAsianet News Telugu

బిజెపి ఆఫర్ ను తిరస్కరించిన వైఎస్ జగన్

డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎకు ఆ పదవి తీసుకోవడం వల్ల దగ్గరైనట్లు సంకేతాలు వెళ్తాయని, దానివల్ల తనకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Jagan Mohan Reddy no to Lok Sabha Deputy Speaker post
Author
Amaravathi, First Published Jun 24, 2019, 6:23 AM IST

విజయవాడ: బిజెపి ఇచ్చిన ఆఫర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. లోకసభ డిప్యూటీ స్పీకర్ పదవిని వైసిపికి ఇవ్వడానికి బిజెపి ముందుకు వచ్చింది. అయితే, తమకు ఆ పదవి వద్దంటూ జగన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. 

డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎకు ఆ పదవి తీసుకోవడం వల్ల దగ్గరైనట్లు సంకేతాలు వెళ్తాయని, దానివల్ల తనకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

తాము వైసిపి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తామని స్పష్టంగా చెప్పలేదని, సంకేతాలు మాత్రమే ఇచ్చామని, వైసిపి ఆసక్తి ఉంటే ఆ పదవి ఇస్తామనే సంకేతాలను పంపించామని బిజెపి నాయకులు అంటున్నారు, ప్రత్యేక హోదా మాత్రమే తమ ప్రథమ ప్రాధాన్యమని, అది లేకుండా ఎన్డీఎ ప్రభుత్వం ఇచ్చే పదవులను తీసుకోవడానికి సిద్దంగా లేమని వైసిపి నాయకులు అంటున్నారు. 

వైసిపికి 22 మంది లోకసభ సభ్యులున్న విషయం తెలిసిందే. లోకసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైసిపి అవతరించింది. వైసిపి డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడానికి ఆసక్తి ప్రదర్శించకపోవడంతో ఆ పదవిని జెడి (యు)కి ఇవ్వాలనే ఆలోచనలో బిజెపి ఉంది. అయితే, ఆ పదవిని శివసేన ఆశిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios