Asianet News TeluguAsianet News Telugu

పీసీసీ చీఫ్ పగ్గాలు నాకివ్వండి, ఆ ప్లాన్ అప్లై చేస్తా : జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలో తన దగ్గర ప్లాన్ ఉందని పద్దతి ప్రకారం వెళ్లి పార్టీని బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాను కూడా కలిశానని పీసీసీ చీఫ్ తనకు ఇవ్వాలని కోరినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలు వీడినా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందన్నారు. 

congress mla jaggareddy wants to tpcc chief post
Author
Hyderabad, First Published Jun 24, 2019, 2:42 PM IST

హైదరాబాద్: వీలుంటే తనకు పీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలో తన దగ్గర ప్లాన్ ఉందని పద్దతి ప్రకారం వెళ్లి పార్టీని బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. 

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాను కూడా కలిశానని పీసీసీ చీఫ్ తనకు ఇవ్వాలని కోరినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలు వీడినా కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందన్నారు. 

తనకు రాని పక్షంలో పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.  

ఇకపోతే మరో వారం రోజుల్లో తెలంగాణ పీసీసీ చీఫ్ గా కొత్తవారిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలం పూర్తవ్వడంతో కొత్తవారిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా వారి జాబితాలో జగ్గారెడ్డి కూడా చేరాలనుకుంటున్నారన్నమాట.

Follow Us:
Download App:
  • android
  • ios