మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యారవేత్త ఉపాసన.. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కొడుకు ఇజాన్ తో సరదాగా గడిపారు. ఇజాన్ తో కలిసి ఉపాసన లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇజాన్ తో కలిసి సరదాగా ఆడుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఈ ఫోటోలలో సానియా మీర్జా, ఆమె సోదరి ఆనం మీర్జా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో క్రికెట్ ప్రపంచ కప్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతోన్న పాకిస్థాన్ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఉన్నారు.

అందుకే ఆమె క్రికెట్ మ్యాచ్ లను చూడడానికి గత కొద్దిరోజులుగా ఇంగ్లాండ్ లోనే ఉన్నారు. ఆమెతో పాటు సోదరి ఆనం మీర్జా, ఆమె భర్త కూడా ఉన్నారు. వీరిని కలిసి ఉపాసన.. లండన్ వీధుల్లో వారితో కలిసి సమయం గడిపింది. సానియాకి ఉపాసనకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పుడప్పుడు కలుసుకుంటూ తమ స్నేహాన్ని తెలియజేస్తుంటారు.