నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’.చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటే.. కొన్ని కారణాల వల్ల అది కాస్తా మే 17కు వాయిదా పడింది. అయితే నిర్మాతలు ప్రకటించిన ఆ తేదీన కూడా సినిమా విడుదల కాలేదు. వరసగా వాయిదాలు పడుతూ వస్తోంది. దాంతో అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది పెద్ద క్వచ్చిన్ మార్క్ గా మారింది. హీరో నిఖిల్ సైతం ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. 

అయితే అందుతున్న సమాచారం మేరకు ఇక ఈ సినిమా రిలీజ్ కష్టమే అని తెలుస్తోంది.  అందుకు కారణం ఈ చిత్రం ఎదుర్కొంటున్న ఫైనాన్స్ సమస్యలే అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే పెండింగ్ డ్యూస్ నాలుగు కోట్లు వరకూ చెల్లించారని సమాచారం. దాంతో పెద్దగా బజ్ లేని ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏ మేరకు ఆడుతుందో అని నిర్మాతలు సందేహపడుతున్నారట. మరో నాలుగు కోట్లు పెడితే అవి కూడా పోతాయని వాళ్ల సన్నిహితులు హెచ్చరిస్తున్నారట.

దాంతో ఆ నాలుగు కోట్లు పెట్టే ఇంట్రస్ట్ లేక అలా పెండింగ్ లో పెట్టేసారని, ఎవరైనా ఉత్సాహంతో ముందుకు వస్తే అవుట్ రేటుకు ఫిల్మ్ ఇచ్చేద్దామని ఎదురుచూస్తున్నారని చెప్తున్నారు. ఈ లోగా నిఖిల్ మరో సినిమా ఏదైనా హిట్ కొట్టి మార్కెట్ పెరిగితే ఆ ఊపులో అమ్మేయచ్చు కదా అని ఎదురుచూస్తున్నారట. ఇవన్ని చూస్తూంటే ఇప్పుడిప్పుడే ఈ సినిమా వచ్చే సూచన లేదని చెప్తున్నారు. అసలు రాకపోయినా ఆశ్చర్యం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దానికి తోడు ఈ సినిమాకు ముందగా ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. కానీ జగపతిబాబు హీరోగా అదే పేరుతో ఓ సినిమా ఇటీవల రిలీజ్ కావటంతో నిఖిల్ సినిమాకు టైటిల్‌కు మార్చక తప్పలేదు.