ఏ సమయాన అర్జున్ రెడ్డి కథను మొదలుపెట్టాడో గాని సందీప్ వంగ కెరీర్ ను ఆ కథ పూర్తిగా మార్చేసింది. 2017లో వచ్చిన ఆ సినిమా టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక బాలీవుడ్ లో కూడా అంతకంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. మూడు రోజుల్లోనే కబీర్ సింగ్ గా వచ్చి 70కోట్లను కొల్లగొట్టింది. 

ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తే ఎవరు మాత్రం సైలెంట్ గా ఉంటారు. వెంటనే బాలీవుడ్ బడా నిర్మాతల నుంచి మనోడికి గ్యాప్ లేకుండా కాల్స్ వస్తున్నాయట. మరికొంత మంది అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా ఓ అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మొత్తానికి ఒక తెలుగు దర్శకుడు ఆడియెన్స్ ని ఫిదా చేసి బడా ప్రొడక్షన్స్ ని సైతం తనవైపుకు తిప్పుకునేలా చేశాడు.

ఇక సందీప్ ఎలాంటి కథ రాసుకున్నా అక్కడి స్టార్ హీరోలు ఈజీగా డేట్స్ ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మహేష్ తో ఒక సినిమా చేయాలనీ అనుకున్న సందీప్ కి దాదాపు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లే. మరి ఈ దర్శకుడి నెక్స్ట్ ఎటువైపు అడుగువేస్తాడో చూడాలి.