Asianet News TeluguAsianet News Telugu

ఆధార్ తెచ్చిన తంట: పీటలపై పెళ్లి ఆపేసిన వరుడు

ఈ ఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గాదెవారిపల్లెలో చోటు చేసుకుంది. ఆధార్ కార్డులో చివర రెడ్డి అని లేకపోవడాన్ని గమనించిన వరుడి కుటుంబం పెళ్లిని క్యాన్సిల్ చేసి వెళ్లిపోయారు. అర్థాంతరంగా పీటలమీద పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లికుమార్తె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 
 
Reddy is the last name not found in Aadhaar,  groom stopped the wedding
Author
Guntur, First Published Jun 24, 2019, 4:39 PM IST

గుంటూరు: కుల మతాలకు అతీతంగా దేశంలో పెళ్లిళ్లు జరుగుతుంటే అక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఆధార్ కార్డులో వధువు తండ్రి పేరు చివర రెడ్డి అని లేకపోవడంతో అర్థాంతరంగా పెళ్లి నిలిపివేశారు వరుడు కుటుంబీకులు. 

ఈ ఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలం గాదెవారిపల్లెలో చోటు చేసుకుంది. ఆధార్ కార్డులో చివర రెడ్డి అని లేకపోవడాన్ని గమనించిన వరుడి కుటుంబం పెళ్లిని క్యాన్సిల్ చేసి వెళ్లిపోయారు. అర్థాంతరంగా పీటలమీద పెళ్లి నిలిచిపోవడంతో పెళ్లికుమార్తె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

క్రోసూరు మండలం గాదెవారిపల్లెకి చెందిన యువతితో సత్తెనపల్లిమండలం గుడిపూడి గ్రామానికి చెందిన  మున్నంగి వెంకటరెడ్డి వివాహం నిశ్చయించుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో వధువు మెడలో తాళికట్టాల్సి ఉండగా ఆధార్ కార్డులో రెడ్డి పేరు లేదంటూ వరుడి కుటుంబ సభ్యులు నానా హంగామా చేశారు. 

పీటలమీద పెళ్లి ఆపేసి వెళ్లిపోయారు. దీంతో వధువు మరియు ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios