టీడీపీ నేత వంగవీటి రాధా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇవాళ లేదా రేపు  ఆయన  జనసేనలో చేరే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు వైసీపీ నుండి వంగవీటి రాధా టీడీపీలో చేరారు.

ఈ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేదు. వైసీపీ ఘన విజయం సాధించింది.విజయవాడ సెంట్రల్ సీటును తనకు కాకుండా మల్లాది విష్ణుకు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో వంగవీటి రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు.

వైసీపీ అధికారంలోకి రావడంతో వంగవీటి రాధా ప్రత్యామ్నాయాన్ని చూసుకొన్నారు.  ఇవాళ  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో వంగవీటి రాధా భేటీ అయ్యారు. టీడీపీని వీడి జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నందునే ఆయన పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారని  రాధా సన్నిహితులు చెబుతున్నారు. ఇవాళ లేదా రేపు వంగవీటి రాధా జనసేనలో చేరే అవకాశం ఉందని సమాచారం.