అల్లు అరవింద్ పెద్ద కుమార్ అల్లు బాబీ ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా పెళ్లి చేయడం, వేడుకలో అల్లు అర్జున్ కనిపించకపోవడంతో ఈ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.

ఇది ఇలా ఉండగా.. అల్లు బాబీ తనకు పెళ్లైన విషయాన్ని తెలుపుతూ కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బాబీకి గతంలో నీలిమ అనే అమ్మాయితో వివాహం జరిగింది.

వీరికి అన్విత అనే కూతురు కూడా ఉంది. దీంతో నెటిజన్లు పెళ్లి చేసుకున్న భార్యని మోసం చేస్తావా..? నీ కూతురు పరిస్థితేంటి..? అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ మరికొందరు చురకలు అంటించారు. ఈ ట్వీట్లు చూసిన అల్లు బాబీ తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఎన్నో ఏళ్లుగా తన భార్యకి దూరంగా ఉంటున్నానని.. పరస్పర అంగీకారంతో 2016లో విడాకులు తీసుకున్నామని.. కానీ పాప కోసం ఇద్దరం అప్పుడప్పుడు కలుస్తుంటామని చెప్పారు. తన కూతురు అన్విత అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు.. తన జీవితంలో అన్విత కూడా ఒక భాగమేనని స్పష్టం చేశారు. ఇప్పటికీ తన మొదటి భార్యతో టచ్ లోనే ఉంటానని.. అల్లు కుటుంబంలో జరిగే ప్రతి వేడుకకు ఆమె హాజరవుతుంటారని.. అల్లు ఫ్యామిలీలో నీలిమ కూడా ఒక మెంబర్ అని చెప్పారు.