ప్రపంచ కప్ టోర్నీలో సెమీస్ ఆశలు సజీవంగా  వుండాలండే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్, ఆ తర్వతా బౌలింగ్ లోనూ రాణించి దక్షిణాఫ్రికాతో లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో  విజయాన్ని అందుకుంది. అయితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పాక్ 308 పరుగులు సాధించడంతోనే సగం మ్యాచ్ గెలిచింది. ఇలా ఆ జట్టు భారీ స్కోరు సాధించడంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ హరీస్ సోహైల్ ముఖ్య పాత్ర పోషించాడు. అతడు కేవలం 59 బంతుల్లోనే 3 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించడమే కాదు సోహైల్ ను పాక్ దిగ్గజాల సరసన నిలబెట్టింది. 

మిడిల్ ఆర్డన్ లో సోహైల్ బ్యాటింగ్ కు దిగి ఎదుర్కొన్నమొదటి బంతి నుండే హిట్టింగ్ ప్రారంభించాడు. ఇలా అతడు మొత్తం 89 పరుగులు చేయగా అందులో 64 పరుగులు కేవలం బౌండరీల రూపంలో వచ్చినవే. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏం రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రపంచ కప్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ పైచిలుకు పరుగులు  ( స్ట్రైక్ రేట్ ఆధారంగా) సాధించిన మూడో పాక్ ఆటగాడిగా సోహైల్ చరిత్ర సృష్టించాడు.

సోహైల్ ఔటయ్యే సమయానికి అతడి స్ట్రైక్ రేట్ 150.84 వుంది.  ప్రపంచ కప్ టోర్నీలో ఇంతకు ముందు ఇమ్రాన్ ఖాన్ (169.69 స్ట్రైక్ రేట్), ఇంజమామ్ హక్ (162.16 స్ట్రైక్ రేట్) లు మాత్రమే సోహైల్ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ పరుగులు సాధించారు. తాజా ఇన్నింగ్స్ తో సోహైల్ ఈ దిగ్గజ పాక్ ఆటగాళ్ల సరసన మూడో స్థానాన్ని ఆక్రమించుకున్నాడు.