బీజేపీలో చేరిన కేంద్రమంత్రి: ఆహ్వానించిన జేపీ నడ్డా

By Nagaraju penumalaFirst Published Jun 24, 2019, 4:50 PM IST
Highlights

ఎస్ జయశంకర్ కు విదేశాంగ శాఖను కట్టబెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎస్.జయశంకర్ సోమవారం అధికారికంగా భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జే.పీ. నడ్డా ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
 
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ లో మంత్రిగా చాన్స్ కొట్టేసిన మాజీ విదేశాంగ కార్యదర్శి జయశంకర్ బీజేపీలో చేరారు. విదేశాంగ శాఖ కార్యదర్శిగా రాయబారిగా విధులు నిర్వహిస్తూ ఇటీవలే రిటైర్ అయిన ఎస్ జయశంకర్ కు మోదీ తన కేబినెట్ లో స్థానం కల్పించారు. 

ఎస్ జయశంకర్ కు విదేశాంగ శాఖను కట్టబెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎస్.జయశంకర్ సోమవారం అధికారికంగా భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జే.పీ. నడ్డా ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు జేపీ నడ్డా. ఇకపోతే జయశంకర్ ను గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

click me!