తన తల్లిదండ్రులు కూడా భూ నిర్వాసితులేనని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమవారం కరీంనగర్ లోని రాజన్నలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

ప్రాజెక్టుల కోసం భూమిని ఇచ్చిన నిర్వాసితులకు ఆయన ఈ సందర్భంగా దన్యావాదాలు తెలిపారు. భూ నిర్వాసితులందరికీ దన్యవాదాలు అని చెప్పారు. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో తన తల్లి కూడా భూమిని పోగొట్టుకుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. త్వరలోనే సిరిసిల్లా జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 

తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలి అనేది సీఎం కేసీఆర్‌ లక్ష్యం అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కృషి చేస్తోన్న ఇంజనీర్ల పని తీరు భేష్‌ అని కేటీఆర్‌ ప్రశంసించారు. నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.