తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:43 PM (IST) Jun 30
Heavy rainfall alert: దేశవ్యాప్తంగా ఈ వారంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు జూలై 5 వరకు కొనసాగనున్నాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
11:05 PM (IST) Jun 30
Agni 5 bunker buster missile: 7,500 కిలోల బంకర్ బస్టర్ వార్‌హెడ్‌తో అగ్ని-5 రాకెట్ అభివృద్ధి చేస్తోంది భారత్. దీంతో బంకర్ టార్గెట్లపై ఖచ్చితమైన దాడులు చేసే శక్తిని పొందతుందని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
10:35 PM (IST) Jun 30
మీరు మహీంద్రా కారు అభిమానులా? మహీంద్రా కారులో ఫీచర్లు మీకు బాగా నచ్చుతాయా? అయితే ఈ వార్త మీకు చాలా ఆనందాన్నిస్తుంది. త్వరలోనే మహీంద్రా నుంచి ఏకంగా 10 కొత్త మోడల్స్ రాబోతున్నాయి. అవి ఎప్పుడు వస్తాయి? వాటి ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందామా?
10:20 PM (IST) Jun 30
Triple Century Destroys Pakistan: 2004లో పాకిస్తాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 309 పరుగుల ట్రిపుల్ సెంచరీతో భారత్ చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయం సాధించింది. పాకిస్తాన్ ను భారత ప్లేయర్ చితక్కొట్టిన ఆ క్షణాలు క్రికెట్ లో ఎప్పటికీ గుర్తుంటాయి.
09:51 PM (IST) Jun 30
Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్‌లో అండర్-19 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ మరొకసారి ధాటిగా ఆడాడు. భారత జట్టుకు మంచి ఇన్నింగ్స్ ను అందించాడు.
09:28 PM (IST) Jun 30
Faf du Plessis: ఫాఫ్ డుప్లెసిస్ టీ20 క్రికెట్ లో 8వ సెంచరీ బాదాడు. అలాగే, బాబర్ ఆజమ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
09:12 PM (IST) Jun 30
ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ బిజెపి చీఫ్ ఎంపిక ఖరారయ్యింది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ మాధవ్? ఆయన నేపథ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
08:39 PM (IST) Jun 30
China kill web: చైనా అభివృద్ధి చేసిన 'కిల్ వెబ్' వ్యవస్థతో ఆసియా నుంచి ఆస్ట్రేలియా వరకు అన్ని దేశాలకు ముప్పు ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఏంటి ఈ కిల్ వెబ్ వ్యవస్థ? ఎందుకు అమెరికాలో ఆందోళన పెంచుతోంది?
07:31 PM (IST) Jun 30
నూతన రాష్ట్రాధ్యక్షుడి నియామయం తెలంగాణ బిజెపిలో కలకలం రేపింది. రాజాసింగ్ రాజీనామాతో బిజెపిలో అంతర్గత ముసలం బైటపడింది… మరి ఇది ఎక్కడివరకు వెళుతుందోమరి…
06:51 PM (IST) Jun 30
Rishabh Pant: ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు. రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీల మోత మోగించాడు. అయితే, నువ్వు సెంచరీలు చేయకు సామీ అని పంత్ ను భారత ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. ఎందుకో తెలుసా?
05:44 PM (IST) Jun 30
మనం నిత్యం సమాజంలో ఎంతో మందిని చూస్తుంటాం. ఎన్నో సంఘటనలు తెలుసుకుంటుంటాం. అయితే వాటిపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. పక్కవారిని జడ్జ్ చేసే ముందు మనం ఎలా చూస్తున్నాం తెలుసుకోవాలనే గొప్ప సందేశం ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
05:12 PM (IST) Jun 30
Sanath Jayasuriya: శ్రీలంక గ్రేట్ లెజెండరీ బ్యాటర్ సనత్ జయసూర్య 36 బౌండరీలతో 340 పరుగులతో విధ్వంస రేపాడు. భారత్‌పై 799 నిమిషాల అజేయ ఇన్నింగ్స్ ఆడి టెస్టు చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ ను నమోదుచేశారు.
05:08 PM (IST) Jun 30
దేశవ్యాప్తంగా త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు పెరిగే అవకాశాలున్నాయో తెలుసా?
04:20 PM (IST) Jun 30
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ. లక్ష దాటేసి పరుగులు పెట్టిన పసిడి ప్రస్తుతం శాంతించింది. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా సోమవారం కూడా బంగారం ధరలు తగ్గాయి.
04:20 PM (IST) Jun 30
BSNL Offers: బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ.400కి 400GB డేటా అందిస్తోంది. అంటే రూపాయికే 1 జీబీ డేటా మీరు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
03:35 PM (IST) Jun 30
వర్షాకాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక వర్షా కాలం సాయంత్రం కాగానే ఆకాశం ఒక్కసారిగా మారిపోతుంది. ఉరుములు, మెరుపులు రావడం సర్వసాధారణం. ఇంతకీ వర్షం పడే సమయంలో మెరుపులు ఎందుకు వస్తాయో తెలుసా.?
03:32 PM (IST) Jun 30
పనితీరుతో సంబంధం లేదు.. శాలరీ ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియదు. సడన్ గా పింక్ స్లిప్ చేతిలో పెట్టి రేపటి నుంచి రావద్దని కొన్ని టెక్ దిగ్గజ కంపెనీలు చెప్పేస్తున్నాయి. ఇది ప్రస్తుతం గ్లోబల్, ఇంటర్నేషనల్ కంపెనీల్లో పరిస్థితి.
03:23 PM (IST) Jun 30
Snakes: వర్షాకాలంలో మీ ఇల్లు, తోట చుట్టూ పాములు తిరుగుతున్నాయా? అది చాలా ప్రమాదకరం. పిల్లలు, పెద్దలు ఎవరైనా ప్రమాదానికి గురవ్వచ్చు. పాములను ఎలా తరిమికొట్టాలని భావిస్తున్నారా? పాముల రాకను తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం అవసరం.
02:46 PM (IST) Jun 30
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలడంతో ఏకంగా 241 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
02:31 PM (IST) Jun 30
తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం పటాన్ చెరు పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో రియాక్టర్ పేలి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఈ కంపెనీలో ఏం తయారవుతుందో తెలుసా?
02:00 PM (IST) Jun 30
Best 5G Phones: రూ.10 వేలకే లేటెస్ట్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ గేమింగ్ ఫీచర్స్, ఫోటోస్, వీడియోస్ ఇలా మీకు కావాల్సిన స్పెషల్ ఫీచర్స్ ఏ కంపెనీ ఫోన్ లో బాగున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
01:56 PM (IST) Jun 30
ఎట్టకేలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఖాయమైంది. మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత రామచందర్ రావును నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ రామచందర్.? ఆయన నేపథ్యం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
12:32 PM (IST) Jun 30
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని EPF సభ్యుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. అధికారికంగా ఎలాంటి మెసేజ్‌లు చేయకపోయినా, చాలా మంది అకౌంట్స్‌లో బ్యాలెన్స్ పెరిగాయి. ఇంతకీ ఎంత వడ్డీ యాడ్ అయిందో ఎలా తెలుసుకోవాలంటే.
11:14 AM (IST) Jun 30
ఎంత అవగాహన పెరుగుతోన్నా మీడియా, సోషల్ మీడియా ద్వారా ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరాలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.
10:59 AM (IST) Jun 30
హైదరాబాద్ నగరానికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకోసం వచ్చే పేదలకు జిహెచ్ఎంసి సాయం అందిస్తోంది. నగరంలో ఉచితంగానే వసతి కల్పించి అహారం అందిస్తోంది.. ఈ సాయం కోసం ఏం చేయాలంటే…
09:59 AM (IST) Jun 30
భారత మార్కెట్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది వన్‌ప్లస్ బ్రాండ్. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసే ఈ సంస్థ తాజాగా మరో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది.
08:06 AM (IST) Jun 30
జూన్ లో ముఖం చాటేసిన వర్షాలు జూలైలో ఏం చేస్తాయోనని తెలుగు ప్రజలు ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల చివరిరోజు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో వాతావరణ శాఖ వెల్లడించింది.