- Home
- Technology
- Gadgets
- OnePlus: వన్‌ప్లస్ లవర్స్‌కి పండగే.. మార్కెట్లోకి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు వచ్చేస్తున్నాయి.
OnePlus: వన్‌ప్లస్ లవర్స్‌కి పండగే.. మార్కెట్లోకి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు వచ్చేస్తున్నాయి.
భారత మార్కెట్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది వన్‌ప్లస్ బ్రాండ్. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసే ఈ సంస్థ తాజాగా మరో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది.
- FB
- TW
- Linkdin
Follow Us

రెండు కొత్త ఫోన్‌లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మార్కెట్లోకి నార్డ్5, నార్డ్ సీఈ5 పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. జూలై 8వ తేదీ నుంచి ఈ ఫోన్‌లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లు అమెజాన్‌లో లభించనున్నాయి.
ఇందుకు సంబంధించి అమెజాన్ ఇప్పటికే ప్రకటనలు విడుదల చేస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎలా ఉండనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్క్రీన్ పరంగా చూస్తే..
నెట్టింట లీక్ అయిన సమాచారం మేరకు ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో కూడిన ఫ్లాట్ OLED ప్యానెల్‌తో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్‌తో స్క్రోలింగ్, గేమింగ్ అనుభూతిని మరింత స్మూత్‌గా చేస్తుంది. స్క్రీన్ సైజ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ 6.74 ఇంచెస్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇవ్వనున్నారు.
కాగా Nord CE 5లో 6.77-ఇంచుల ఫ్లాట్ OLED స్క్రీన్ ఉండనుందని తెలుస్తోంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందనే అంచనా. ఇది స్క్రీన్ క్వాలిటీని పెంచుతుందని చెబుతున్నారు.
కెమెరా విషయానికొస్తే
OnePlus Nord 5లో ప్రధాన కెమెరాగా Sony LYT-700 సెన్సార్‌ను ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇదే కెమెరా గతంలో OnePlus 13 సిరీస్‌లో కనిపించింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, రాత్రిపూట తీసే ఫోటోలలోనూ క్లీన్ అవుట్‌పుట్ ఇవ్వడం. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీని తోపాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది, ఇది 116-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా (JN5 సెన్సార్‌తో) ఉండనుంది.
ఇక Nord CE 5 విషయానికి వస్తే, ఇది 50MP ప్రాధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాతో రానుంది. ఫ్రంట్ కెమెరాగా 16MP సెన్సార్ ఉంటుందని అంచనా. అంటే, మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో మంచి కెమెరా ఫీచర్లను అందించనుంది.
శక్తివంతమైన ప్రాసెసర్
Nord 5లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు అమెజాన్ టీజర్ ద్వారా అధికారికంగా వెల్లడైంది. ఇది అత్యంత పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లలో ఒకటి. గేమింగ్, మల్టీటాస్కింగ్, ఫాస్ట్ యాప్ లాంచింగ్ వంటి ఫీచర్లను బాగా హ్యాండిల్ చేయగలదు. ఈ ఫోన్ లో 7,300 mm² కూలింగ్ ఛాంబర్‌ను కూడా అందించనున్నారు. దీంతో ఫోన్ వేడెక్కదు.
Nord CE 5 విషయానికి వస్తే, ఇది MediaTek Dimensity 8350 Ultimate చిప్‌సెట్‌తో రానుంది. ఇది ఇప్పటికే Infinix GT 30 Pro, Motorola Edge 60 Pro లాంటి ఫోన్లలో దీనిని అందించారు. మిడ్ రేంజ్ యూజర్లకు ఇది మంచి పనితీరును అందించే అవకాశం ఉంది.
ధరలు ఎలా ఉండనున్నాయి.?
ఇక ధర విషయానికొస్తే కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ సిరీస్‌ను బడ్జెట్ ధరలోనే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Nord 5ను సుమారు రూ. 29,999 లేదా దాని కంటే కొంచెం ఎక్కువ ధరకు అందించవచ్చని అంచనా వేస్తున్నారు.
అలాగే Nord CE 5 విషయానికి వస్తే, ఇది సుమారు రూ. 25,000 ధరలో రానుందని అంచనా. Nord CE 4ను గతంలో రూ. 24,999కి తీసుకువచ్చారు. దీంతో ఈ మోడల్ ఇదే రేంజ్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా. మొత్తం మీద మిడ్ రేంజ్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకోవడానికి వన్‌ప్లస్ పక్కా ప్లాన్ వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఎప్పుడు అందుబాటులోకి రానుంది.?
వన్‌ప్లస్ నార్డ్5, వన్‌ప్లస్ సీఈ5 ఫోన్లు జూలై 8వ తేదీన అధికారికంగా లాంచ్ కానుంది. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే Nord 5 కోసం ప్రత్యేకంగా అమెజాన్‌లో లాండింగ్ పేజీ లైవ్ అయ్యింది. అందులో ఫోన్ లుక్, డిజైన్ హైలైట్స్, కలర్ ఆప్షన్లు వంటి కీలక అంశాలను చూపిస్తున్నారు. మరి ఈ ఫోన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.