Gold Price: పతనమవుతోన్న బంగారం ధర.. ఎందుకిలా.? ఇంకా తగ్గనుందా.?
బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రూ. లక్ష దాటేసి పరుగులు పెట్టిన పసిడి ప్రస్తుతం శాంతించింది. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా సోమవారం కూడా బంగారం ధరలు తగ్గాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,410గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,300 వద్ద కొనసాగుతోంది.
* ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,260, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,150గా ఉంది.
* చెన్నైలో 10 గ్రాముల 25 క్యారెట్ల బంగారం ధర రూ. 97,260కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,150 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,260గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,150 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.?
* హైదరాబాద్‌లోనూ బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,260గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,150 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 97,260కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,150గా ఉంది.
* విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,260కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,150గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.?
వెండి ధరలో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,07,700 వద్ద కొనసాగుతోంది. కాగా హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,17,700గా ఉంది.
బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి.?
మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల బంగారం, వెండి ధరల్లో వచ్చిన మార్పునకు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిపోవడమే అని తెలిపారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ భయాలు తగ్గిపోవడంతో పెట్టుబడిదారులు ‘రిస్క్ ప్రీమియం’ను తగ్గించారు. ఫలితంగా బంగారం ఒక నెలలో కనిష్ట స్థాయికి చేరగా, వెండి కూడా అదే దారిలో పతనమైంది.
ఫెడ్ వడ్డీ రేట్లపై ఆశలు తగ్గిపోవడం కూడా
అమెరికా ఫెడ్ రిజర్వ్ తీరుపై పెట్టుబడిదారులు తమ అంచనాలను పునఃసమీక్షిస్తున్నారు. వడ్డీ రేట్ల తగ్గుదలపై ఆశలు గతంలో పోలిస్తే తగ్గిపోవడంతో బంగారంపై ఒత్తిడి పెరిగిందని రాహుల్ వివరించారు. ఫెడ్ త్వరలో రేట్లు తగ్గించనుందన్న భావన కూడా బంగారం ధరపై ప్రభావం చూపిందని అభిప్రాయపడుతున్నారు.
బంగారం ధర ఇంకా తగ్గనుందా.?
బంగారం ధరలు ఇంకా తగ్గనున్నాయా.? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అమెరికా డాలర్ పతనం కావడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.