MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Best 5G Phones: రూ.10,000 లోపు బెస్ట్ 5G ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? లావా నుండి శాంసంగ్ వరకు టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే

Best 5G Phones: రూ.10,000 లోపు బెస్ట్ 5G ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? లావా నుండి శాంసంగ్ వరకు టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే

Best 5G Phones: రూ.10 వేలకే లేటెస్ట్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ గేమింగ్ ఫీచర్స్, ఫోటోస్, వీడియోస్ ఇలా మీకు కావాల్సిన స్పెషల్ ఫీచర్స్ ఏ కంపెనీ ఫోన్ లో బాగున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.   

3 Min read
Naga Surya Phani Kumar
Published : Jun 30 2025, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
Image Credit : Social Media

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

స్మార్ట్ ఫోన్లు కొత్త కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇంతకు ముందు పండగలు, ప్రత్యేకమైన సేల్స్ టైమ్ లో కొత్త ఫోన్లు మార్కెట్ లో సందడి చేసేవి. ఇప్పుడు అలా కాకుండా ప్రతి నెలా అనేక కొత్త ఫోన్‌లు విడుదలవుతున్నాయి. మీ ప్రత్యేక అవసరాలకు సరైన స్మార్ట్ ఫోన్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఈ ఆర్టికల్ మీకు మంచి సమాచారాన్ని అందిస్తుంది. మీరు కేవలం రూ.10,000 లోపు మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ని కొనుక్కోవాలంటే ఇక్కడ టాప్ 5 ఫోన్ల వివరాలు ఉన్నాయి. వాటి ఫీచర్లను తెలుసుకొని మీకు నచ్చిన ఫోన్ ను సెలెక్ట్ చేసుకోండి. 

25
Samsung M06 5G
Image Credit : samsung

Samsung M06 5G

మీరు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు కావాలనుకుంటే Samsung కంపెనీ ఫోన్ బెస్ట్. ఇందులో M06 5G ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇది 800 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆర్మ్ మాలి G57 MC2 GPU కలిగిన ఈ ఫోన్ 4GB లేదా 6GB LPDDR4X RAM ను కలిగి ఉంది. అంతేకాకుండా 128 GB స్టోరేజ్‌కెపాసిటీ ఉన్న ఈ ఫోన్ లో మైక్రో SD కార్డ్ స్లాట్ పెట్టుకొనే అవకాశం కూాడా ఉంది. దీని ద్వారా 1TB వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు.  

Samsung M06 5G ఫోన్… 50MP ప్రైమరీ షూటర్, 2MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఏకంగా 8MP కెమెరా ఉంది.

ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంది. అందువల్ల ఎక్కువ సేపు ఫోన్ పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్ కు కంపెనీ ఛార్జర్ ఇవ్వడం లేదు.

Related Articles

Related image1
Smart phones: గేమింగ్ ఫీచర్స్ ఉన్న ఇంత మంచి స్మార్ట్ ఫోన్ల ధర.. రూ.15 వేల కంటే తక్కువేనా?
Related image2
Smart Phones Under 20K: రూ. 20 వేల లోపు విలువ గ‌ల 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!
35
iQOO Z10 Lite 5G
Image Credit : Social Media

iQOO Z10 Lite 5G

iQOO Z10 లైట్ 90Hz రిఫ్రెష్ రేట్, 1000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మాలి G57 MC2 GPU ఉండటం వల్ల దీని పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఇది 8GB వరకు LPDDR4x RAM, 256 GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. 

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15లో పనిచేస్తుంది. ఇది 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా వేగంగా ఛార్జింగ్ అవుతుంది. 

కెమెరా విషయానికొస్తే 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో పనిచేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5MP ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. అందువల్ల ఫోటోస్, వీడియోలు బాగా కావాలనుకొనే వారు ఈ ఫోన్ తీసుకోవడం బెస్ట్.  

45
Infinix Hot 50 5G
Image Credit : Google

Infinix Hot 50 5G

ఇన్ఫినిక్స్ హాట్ 50 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆర్మ్ మాలి G57 MC2 GPU సపోర్ట్ తో పనిచేస్తుంది. ఇది 8GB వరకు LPDDR4x RAM ను సపోర్ట్ చేస్తుంది. 128GB UFS 2.2 స్టోరేజ్‌కు మద్దతు ఇస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ కెపాసిటీ పెంచుకోవచ్చు. 

ఈ ఫోన్ 48MP ప్రైమరీ సోనీ IMX582 ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఇన్ఫినిక్స్ XOS 14.5లో నడుస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీ, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.

55
lava storm play 5g
Image Credit : Google

lava storm play 5g

లావా స్టార్మ్ ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. ఇందులో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6GB LPDDR5 RAM, 128GB UFS 3.1 స్టోరేజ్‌ కెపాసిటీ కలిగిన ఈ ఫోన్ ఫోటోస్, వీడియోస్ కు బాగా సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని కూడా పెంచుకోవచ్చు. 

ఇది 50MP సోనీ IMX752 ప్రైమరీ కెమెరా అద్భుతమైన ఫోటోలు తీస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఇందులో ఉంది.

ఈ ఫోన్ 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved