- Home
- Business
- Layoffs: వామ్మో.. మన ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్న ప్రపంచ దిగ్గజ కంపెనీలు. మీరు ఈ కంపెనీల్లో ఉన్నారా?
Layoffs: వామ్మో.. మన ఉద్యోగాలు ఉంటాయా? పోతాయా? భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్న ప్రపంచ దిగ్గజ కంపెనీలు. మీరు ఈ కంపెనీల్లో ఉన్నారా?
పనితీరుతో సంబంధం లేదు.. శాలరీ ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో తెలియదు. సడన్ గా పింక్ స్లిప్ చేతిలో పెట్టి రేపటి నుంచి రావద్దని కొన్ని టెక్ దిగ్గజ కంపెనీలు చెప్పేస్తున్నాయి. ఇది ప్రస్తుతం గ్లోబల్, ఇంటర్నేషనల్ కంపెనీల్లో పరిస్థితి.

2025 మొదలైనప్పటి నుంచి భారీగా ఉద్యోగాల్లో కోతలు
గ్లోబల్, ఇంటర్ నేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్న సందర్భం ఇది. ఈ రోజు జాబ్ కి వెళ్లి ఇంటికి వచ్చాకా రేపటి నుంచి ఆఫీస్ కి రావద్దని అంటారేమోనని ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి కనిపిస్తోంది. అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. వాటిల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక చిన్న సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2025 సంవత్సరం మొదలైన తర్వాత ఇప్పటి వరకు లక్షల్లో ఉద్యోగాలు పోయాయి. ఏఏ కంపెనీలు ఎంతెంత మందిని తొలగించారో ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ లో ఎలా ఉందంటే..
2025లో గ్లోబల్ టెక్ పరిశ్రమలో భారీ ఉద్యోగాల తొలగింపు(layoffs) కార్యక్రమం నడుస్తోంది. ప్రత్యేకించి చిప్ తయారీ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్ వంటి రంగాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ (Microsoft)
ఈ సంస్థ 2025 లో నాల్గవసారి layoffs ప్రకటించింది. ఈ ఏడాది మేలో 6,000–7,000 ఉద్యోగులను తొలగించింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సంస్థ బ్రాంచుల్లో సుమారు 3 % సిబ్బందిని తొలగించిందన్న మాట.
ఈ తొలగింపులు ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో కనిపిస్తోంది. AI పెట్టుబడులపై దృష్టి సారించేందుకే మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారని తెలుస్తోంది.
ఇంటెల్ కంపెనీలో ఇదీ పరిస్థితి..
2025 మొదటి ఆరు నెలల్లో టెక్ రంగంలో 76,000లకు పైగా ఉద్యోగాలు పోయాయి. ఇతర నాన్ టెక్ కంపెనీలను కలిపితే మొత్తం 1,00,000కి పైగా ఉద్యోగాలు తొలగించారు.
ఒక్క ఇంటెల్(Intel) సంస్థే 21,000–25,000 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఒక టెక్ కంపెనీ లో అతిపెద్ద లేఆప్ ప్రకటనగా ఇది నిలిచింది.
ఇంకా 10,000కు పైగా ఉద్యోగాలు ఫౌండ్రీ విభాగంలో మాత్రమే తొలగిస్తున్నట్లు సమాచారం. ఫౌండ్రీ, ఆటోమోటివ్ విభాగాల్లో ఎక్కువగా ఉద్యోగుల కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్లోబల్‌గా మొత్తం ఉద్యోగుల తొలగింపులు 62,000–63,000 లోపల ఉన్నాయని layoffs.fyi. సంస్థ తెలిపింది
మెటాలో 5 శాతం కోతలు
ఈ మధ్య Meta తన ప్రపంచ సిబ్బందిలో 5% తొలగించింది. అంటే సుమారు 3,600 ఉద్యోగాలు తొలగించింది. ఎంప్లాయిస్ పర్ఫామెన్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
అదే విధంగా క్రౌడ్‌స్ట్రైక్ (Crowd Strike) మే నెలకు గాను సుమారు 500 ఉద్యోగాలు (5%) తొలగించిందని ప్రకటించింది. ఇది AI విస్తరణ కారణంగా ఆపరేషనల్ సామర్థ్యం పెంచుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పానసోనిక్ 10,000 ఉద్యోగాలు తొలగిస్తోంది. టీవీలు, పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని, AI ఉపయోగించుకొని లేటెస్ట్ టెక్నాలజీస్ ను డెవలప్ చేసుకోవాలని చూస్తోంది.
తొలగింపుల వెనుక నిజాలు
AI ప్రభావం: ఆటోమేషన్, AI కారణంగాఉద్యోగాలలో కోతలు భారీగా జరుగుగున్నాయి. దీనికి తోడు నిర్వహణ ఖర్చులు పెరగడం, AI వల్ల అవన్నీ తగ్గడం కూడా మరో ముఖ్య కారణమని తెలుస్తోంది. వరుస పెట్టుబడులు, వడ్డీ ధరలు పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు కూడా ఉద్యోగుల తొలగింపునకు కారణం.
వ్యాపార దిశలో మార్పులు: పాత విభాగాలను మూసివేసి, కొత్త పరిధులైన AI, Cloud, Cybersecurityపై దృష్టిని మరలించించాలని చాలా కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్థిక భారాలను తగ్గించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.
ఉద్యోగులు కొత్త టెక్నాలజీస్ ను నేర్చుకోకపోతే ఉద్యోగాలు ఎంతకాలం ఉంటాయో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.