తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:57 PM (IST) Jul 15
ENG vs IND 4th Test Preview: మాంచెస్టర్‌లో జూలై 23న ప్రారంభమయ్యే 4వ టెస్టులో బుమ్రా ఎంపిక భారత్ కు కీలకం. డాసన్ 8 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ నుంచి టెస్ట్ పిలుపు అందుకున్నాడు. హీట్ పెంచిన లార్డ్స్ టెస్ట్ తర్వాత జరుగుతున్న ఈ మ్యాచ్ ఉత్కంఠను పెంచుతోంది.
10:52 PM (IST) Jul 15
West Indies: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో వెస్టిండీస్ కేవలం 27 పరుగులకే ఆలౌట్ కావడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఈ క్రమంలోనే విండీస్ క్రికెట్ బోర్డ్ అత్యవసరంగా సమావేశమైంది.
09:51 PM (IST) Jul 15
Hat Tricks in WTC: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో హ్యాట్రిక్ తో స్కాట్ బోలాండ్ సంచలనం సృష్టించాడు. డబ్ల్యూటీసీలో హ్యాట్రిక్ కొట్టిన నలుగురు ఫాస్ట్ బౌలర్లలో భారత స్టార కూడా ఉన్నాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
08:50 PM (IST) Jul 15
అమెరికా, రష్యా, చైనా వంటి అత్యాధునిక సైనిక సంపత్తి కలిగిన దేశాల సరసన చేరే గేమ్-ఛేంజింగ్ హైపర్‌సోనిక్ క్షిపణిని భారతదేశం పరీక్షించింది. ఏమిటీ మిస్సైల్? దీని ప్రత్యేకతలేంటి? ఇక్కడ తెలుసుకుందాం.
08:08 PM (IST) Jul 15
school college bandh: తెలంగాణలో విద్యాసంస్థల సమస్యలపై వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 23న బంద్‌కు పిలుపునిచ్చాయి. స్కూల్స్, కాలేజీలు మూతపడనున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
06:45 PM (IST) Jul 15
బెంగళూరులో ఒక ఆటో డ్రైవర్ జీవిత కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబుల్ ఎమ్ఏ చేసి, ఏడు భాషలు మాట్లాడుతూ ఐఏఎస్ కావాలనుకున్న అతడు ఆటో డ్రైవర్ గా ఎలా మారాడో చెబుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.
06:37 PM (IST) Jul 15
PIB fact check: సమోసా, జిలేబీ, లడ్డూలు, ఛాయ్ బిస్కెట్లపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరికలు చేసిందనే వార్తలు వైరల్ గా మారాయి. వాటిని తినొద్దనే ఆదేశాలు నిజంగానే కేంద్రం ఇచ్చిందా? లేదా ఇది ఫేక్ వార్తేనా? పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో ఏం తేలింది?
06:10 PM (IST) Jul 15
Visakhapatnam: ట్రాయ్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ డ్రైవ్ టెస్టులో విశాఖపట్నంలో జియో 204.91 Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో దుమ్మురేపింది. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే జియో వాయిస్, డేటా సేవలలో టాప్ లో కొనసాగుతోంది.
05:57 PM (IST) Jul 15
ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో తెలిసిందే. హైదరాబాద్‌లో మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఓ రేంజ్‌లో విస్తరించింది. రానున్న రోజుల్లో హైదరాబాద్ మెట్రో మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
05:05 PM (IST) Jul 15
Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో 18 రోజుల మిషన్ పూర్తి చేసి విజయవంతంగా భూమిపైకి తిరిగివచ్చారు. అయితే, శుభాంశు శుక్లా స్పేస్ నుంచి ఏం తీసుకొచ్చారు? భారత్ కు కలిగే ప్రయోజనాలేంటి? ఆ వివరాలు ఇప్పు డు తెలుసుకుందాం.
04:09 PM (IST) Jul 15
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట సీరిస్ మరింత రసవత్తరంగా మారింది. 2-1 తో టీమిండియా కంటే ఇంగ్లాండ్ ముందజలో ఉంది… ఈ క్రమంలో కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియాలో మార్పులు తప్పేలా లేవు. ఆ యువ ప్లేయర్ పై వేటు పడుతుందా?
03:55 PM (IST) Jul 15
అమెరికాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్‌లోకి అడుగు పెట్టింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర తీస్తూ దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తొలి షోరూమ్ అధికారికంగా ప్రారంభమైంది.
03:44 PM (IST) Jul 15
సినిమా మీద ప్రేమతో ఎంత రీస్క్ చేయడానికైనా వెనకాడని నటీనటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కింగ్ నాగార్జున కూడా ఒకరు. ఆయనకు నటన అంటే ఎంతో ఇష్టం.. పాత్రలకోసం ప్రాణాలకు తెగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నమయ్య సినిమా కోసం నాగార్జున ఏం చేశారో తెలుసా?
03:40 PM (IST) Jul 15
Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా భూమిపైకి తిరిగొచ్చారు. 41 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించిన రెండవ భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.
02:42 PM (IST) Jul 15
మనిషి శాస్త్రసాంకేతికంగా ఎంగానో ఎదుగుతున్నాడు. ముఖ్యంగా ప్రయాణ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ వరుసలో ముందుండే చైనా తాజాగా మరో అద్భుతాన్ని సాకారం చేసింది.
01:46 PM (IST) Jul 15
ఆమె అతి చిన్న వయసులోని సివిల్స్ ర్యాంక్ సాధించిన తెలుగమ్మాయి. కానీ సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ను కాదనుకుని క్యాట్ లో పోరాడిమరీ వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా?
01:25 PM (IST) Jul 15
యెమెన్ లాంటి దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హత్యలాంటి నేరాల్లో చిక్కుకున్న వారికి కచ్చితంగా మరణ శిక్ష పడుతుంది. అలాంటి ఓ శిక్షనే ఎదుర్కొంటోంది కేరళకు చెందిన నిర్మిష.
12:04 PM (IST) Jul 15
యూపీఐ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల యూపీఐ పేమెంట్స్‌ను కొందరు యాక్సెప్ట్ చేయడం లేదు. దీనివెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే.?
11:16 AM (IST) Jul 15
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఆయన బ్యాగ్రౌండ్ మామూలుగా లేదు… కుటుంబమంతా సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో నిండివుంది. తెలంగాణ కొత్త చీఫ్ జస్టిస్ గురించి ఆసక్తికర విశేషాలు…
11:08 AM (IST) Jul 15
మార్కెట్ వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిత్యవసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రానున్న వారాల్లో ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే..
10:30 AM (IST) Jul 15
క్రికెట్ అంటేనే అద్భుతాలు. ఒక్క బాల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది. టీ20 హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా టెస్ట్ మ్యాచ్‌లను క్రికెట్ లవర్స్ ఆస్వాదిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ అసలైన టెస్ట్ మ్యాచ్ మజాను చూపించింది.
09:28 AM (IST) Jul 15
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి.
07:10 AM (IST) Jul 15
తెలుగు రాష్ట్రాల్లో ఇకపై భారీ వర్షాలు కురుస్తాయంటూ గుడ్ న్యూస్ చెబుతోంది వాతావరణ శాఖ. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఈ వర్షాలు ఎప్పటినుండి మొదలుకానున్నాయో తెలుసా?