MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Shubhanshu Shukla: శుభాంశు శుక్లా స్పేస్ నుంచి ఏం తీసుకొచ్చారు? భారత్ కు కలిగే ప్రయోజనాలేంటి?

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా స్పేస్ నుంచి ఏం తీసుకొచ్చారు? భారత్ కు కలిగే ప్రయోజనాలేంటి?

Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో 18 రోజుల మిషన్ పూర్తి చేసి విజయవంతంగా భూమిపైకి తిరిగివచ్చారు. అయితే, శుభాంశు శుక్లా స్పేస్ నుంచి ఏం తీసుకొచ్చారు? భారత్ కు కలిగే ప్రయోజనాలేంటి? ఆ వివరాలు ఇప్పు డు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 15 2025, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సురక్షితంగా భూమిపైకి శుభాంశు శుక్లా ఏం తీసుకొచ్చారు?
Image Credit : ANI

సురక్షితంగా భూమిపైకి శుభాంశు శుక్లా ఏం తీసుకొచ్చారు?

శుభాంశు శుక్లా స్పేస్‌ఎక్స్ డ్రాగన్ గ్రేస్ క్యాప్సూల్ ద్వారా భూమికి విజయవంతంగా తిరిగొచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) లో 18 రోజుల మిషన్ పూర్తి చేశారు. ఆయనతో పాటు 264 కిలోల (580 పౌండ్ల) శాస్త్రీయ ప్రయోగాలకు సంబంధించిన అన్నింటిని ఆయన తీసుకొచ్చారు. 

ఇందులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO ఆధ్వర్యంలో నడిచిన ఏడు ప్రధాన ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు, నమూనాలు కూడా ఉన్నాయి. అలాగే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) 31 దేశాల 60 ప్రయోగాల డేటా కూడా తీసుకొచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత్ కు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
Image Credit : X-@Axiom_Space

భారత్ కు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ ప్రయోగాల ద్వారా భారతదేశానికి పలు శాస్త్రీయ, సాంకేతిక ప్రయోజనాలు లభించనున్నాయి. ముఖ్యంగా మైక్రోగ్రావిటీలో కండరాల పునరుత్పత్తి (Myogenesis-ISRO).. అంటే స్టెమ్ సెల్స్, మైటోకాండ్రియా మెటబాలిజం పై పరిశోధన వివరాలు. ఇది అంతరిక్షయాత్రికుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక, వృద్ధాప్యము, ఇతర వ్యాధులతో కలిగే కండరాల ప్రభావంపై చికిత్సను అందించడంలో కీలక అంశాలను వెల్లడించనుంది.

ఎముకల ఆరోగ్యం, రేడియేషన్ మానిటరింగ్: ఈ ప్రయోగంలో ఆస్టియోపొరోసిస్ చికిత్సల అభివృద్ధి, రేడియేషన్ సురక్షిత చర్యల రూపకల్పన సాధ్యమవుతుంది.

35
వ్యవసాయం, జీవన వాతావరణంపై పరిశోధనలు
Image Credit : ANI

వ్యవసాయం, జీవన వాతావరణంపై పరిశోధనలు

విత్తన మొలకలు: మైక్రోగ్రావిటీలో మొలకెత్తిన మినప, మెంతులు సహా ఆరు రకాల పంటలపై పరిశోధనలు జరిపారు. వీటి జెనెటిక్, పోషక విలువలు, మైక్రోబైయోమ్ మార్పులను విశ్లేషిస్తున్నారు. ఇది అంతరిక్ష వ్యవసాయం కోసం మౌలిక దశగా, భూమిపై ఎండారి ప్రాంతాల్లో సాగు చేయడంలో కీలకంగా ఉండనుందని భావిస్తున్నారు.

మైక్రో ఆల్గే, సైనోబాక్టీరియా: ఆహారం, ఆక్సిజన్ ఉత్పత్తి, కార్బన్, బయోఫ్యూయల్ సామర్థ్యాల పరిశీలన జరిగింది. ఈ అధ్యయనాలు ISRO గగనయాన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ రూపకల్పనలో సహాయపడతాయి.

45
బయోటెక్నాలజీ, ఎక్స్‌ట్రీమ్ జీవులపై పరిశోధనలు
Image Credit : X-@ISROSpaceflight

బయోటెక్నాలజీ, ఎక్స్‌ట్రీమ్ జీవులపై పరిశోధనలు

టార్డిగ్రేడ్స్ పై పరిశోధన: రేడియేషన్, శూన్యంలో టార్డిగ్రేడ్స్ ఎలా జీవించగలుగుతాయన్న అంశంపై అధ్యయనం చేశారు. ఇది రేడియేషన్ షీల్డింగ్‌లోనే కాక, బయోమెడికల్, మెటీరియల్ సైన్స్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని భావిస్తున్నారు.

మనుషులు-టెక్నాలజీ పరిశీలన

డిస్‌ప్లేలు: మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో టచ్‌స్క్రీన్ లేదా చూపుతో ఆధారపడే కంట్రోల్ వ్యవస్థలపై యాత్రికులు ఎలా స్పందిస్తారో విశ్లేషించారు. ఇది భవిష్యత్తులో స్పేస్‌క్రాఫ్ట్ ఇంటర్‌ఫేస్‌లతో పాటు విమానయాన, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు, వీఆర్ అప్లికేషన్ల అభివృద్ధికి దోహదపడుతుంది.

55
ఇస్రో , గగనయాన్‌లపై ప్రభావం
Image Credit : ANI

ఇస్రో , గగనయాన్‌లపై ప్రభావం

గగనయాన్ ప్రోగ్రాంకు ప్రాథమిక అధ్యయనం: ఈ మిషన్ ద్వారా ఇస్రో (ISRO)కు అంతరిక్ష సిబ్బంది శిక్షణ, ఆరోగ్య మానిటరింగ్, మిషన్ ప్లానింగ్, గ్రౌండ్-స్పేస్ సమన్వయం వంటి కీలక అనుభవాలు లభించాయి.

పరిశోధనల నిర్మాణం: ఈ ఏడు ప్రయోగాలు ISRO, భారతీయ పరిశోధనా సంస్థల సహకారంతో అభివృద్ధి చేశారు. ప్రయోగ నమూనాల విశ్లేషణకు ISRO నాయకత్వం వహించనుంది, దీని ఫలితాలు గగనయాన్ మిషన్ అవసరాలకు కీలకంగా మారతాయి.

శుభాంశు శుక్లా కేవలం శాస్త్రీయ నమూనాలు మాత్రమే కాక, భారత అంతరిక్ష పరిశోధనకు దోహదపడే కీలక పాఠాలను తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇది గగనయాన్, అంతరిక్ష వ్యవసాయం, జీవన వాతావరణ వ్యవస్థలు, అంతరిక్ష బయోటెక్నాలజీ వంటి రంగాల్లో భారత స్థాయిని మెరుగుపరిచే ప్రాథమిక దశగా నిపుణులు పేర్కొంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Related Stories
Recommended image1
IND vs ENG: లార్డ్స్ టెస్టులో గిల్, గంభీర్ పెద్ద పొరపాటు.. భారత్ ను అదే దెబ్బకొట్టిందా?
Recommended image2
Shubhanshu Shukla: విజ‌య‌వంతంగా భూమిపైకి తిరిగొచ్చిన శుభాంశు శుక్లా .. కొత్త చ‌రిత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved