MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • APPSC : ఇంటర్ చదివిన తెలుగు స్టూడెంట్స్ కు అద్భుత అవకాశం... 80 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

APPSC : ఇంటర్ చదివిన తెలుగు స్టూడెంట్స్ కు అద్భుత అవకాశం... 80 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి. 

2 Min read
Arun Kumar P
Published : Jul 15 2025, 09:28 AM IST| Updated : Jul 15 2025, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
APPSC
Image Credit : X/DFOpkd

APPSC

APPSC Jobs Notifiication : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అటవీశాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. ఈమేరకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీచేసింది చంద్రబాబు సర్కార్... దీంతో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 691 (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435) ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి సిద్దమయ్యింది.

25
ఫారెస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం
Image Credit : Gemini

ఫారెస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం

అప్లికేషన్ తేదీలివే :

జులై 16 నుండి అంటే బుధవారం నుండి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 5, 2025 అర్థరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి?

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in లోకి వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మొదటిసారి ఏపిపిఎస్సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసువారు ముందుగా OTPR (One Time Profile Registration) పూర్తిచేసాక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : రూ.250 (ఎగ్జామినేషన్ ఫీజు కింద రూ.80 అదనంగా చెల్లించాలి)

ఎస్సి, ఎస్టి, బిసి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఈ ఎగ్జామినేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.

Related Articles

Related image1
High paying jobs: రూ. లక్ష‌ల్లో జీతాలు రావాలా.? ఇంజ‌నీర్‌, డాక్ట‌రే అవ్వాల్సిన ప‌నిలేదు.
Related image2
government jobs notification : కేవలం టెన్త్ అర్హతతో... పరీక్ష లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
35
ఫారెస్ట్ జాబ్స్ కు కావాల్సిన అర్హతలు
Image Credit : Getty

ఫారెస్ట్ జాబ్స్ కు కావాల్సిన అర్హతలు

విద్యార్హతలు :

ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హతలు కలిగివుండాలి.

ఫిజికల్ అర్హతలు :

163 సెంటిమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగివుండాలి. మహిళలు 150 సెం.మీ ఎత్తుండాలి.

పురుషులు 84 సెంటిమీటర్ల చెస్ట్ కలిగివుండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ పెరగాలి.

మహిళలు 79 సెం.మీ చెస్ట్ కలిగివుండాలి, గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ పెరగాలి.

రాతపరీక్ష తర్వాత నడక టెస్ట్ ఉంటుంది. పురుషులు 4 గంటల్లో 25 కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. మహిళలు 4 గంటల్లో 16 కిలోమీటర్లు నడవాలి.

మెడికల్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ ప్రోఫిషన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.

45
ఎలా ఎంపిక చేస్తారు?
Image Credit : pexels

ఎలా ఎంపిక చేస్తారు?

ఎంపిక విధానం :

స్క్రీనింగ్ టెస్ట్ : మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది

జనరల్ స్టడీస్ 75 మార్కులు

జనరల్ సైన్స్ ఆండ్ జనరల్ మ్యాథ్స్ 75 మార్కులు

నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

మెయిన్ టెస్ట్ :

స్క్రీనింగ్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ టెస్ట్ రాస్తారు.

క్వాలిఫైయింగ్ టెస్ట్ : తెలుగు లేదా ఇంగ్లిష్ లేదా ఉర్దూలో జనరల్ వ్యాసం రాయాలి. 45 నిమిషాల సమయం - 50 మార్కులు

పేపర్ 1 : జనరల్ స్టడీస్ ఆండ్ మెంటల్ ఎబిలిటి : 100 ప్రశ్నలు, 100 నిమిషాలు, 100 మార్కులు

పేపర్ 2 : జనరల్ సైన్స్ ఆండ్ జనరల్ మ్యాథ్స్ ; 100 ప్రశ్నలు, 100 ప్రశ్నలు, 100 మార్కులు

55
ఫారెస్ట్ ఉద్యోగాలకు సాలరీ?
Image Credit : Getty

ఫారెస్ట్ ఉద్యోగాలకు సాలరీ?

వయోపరిమితి :

18 నుండి 30 ఏళ్లలోపు వయసుగల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అయితే 01-07-2025 నాటికి ఈ మధ్యలో వయసు ఉండాలి.

ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. వీరికి 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు (క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు) 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

సాలరీ :

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ : రూ.25,220-80,910

అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ : రూ.23,120-74,770

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఉద్యోగాలు, కెరీర్
విద్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Recommended image2
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Recommended image3
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి?
Related Stories
Recommended image1
High paying jobs: రూ. లక్ష‌ల్లో జీతాలు రావాలా.? ఇంజ‌నీర్‌, డాక్ట‌రే అవ్వాల్సిన ప‌నిలేదు.
Recommended image2
government jobs notification : కేవలం టెన్త్ అర్హతతో... పరీక్ష లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved