MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అన్నమయ్య సినిమా కోసం ప్రాణాలకు తెగించిన నాగార్జున, ఆ ఒక్క సీన్ కోసం అంత రిస్క్ చేశాడా?

అన్నమయ్య సినిమా కోసం ప్రాణాలకు తెగించిన నాగార్జున, ఆ ఒక్క సీన్ కోసం అంత రిస్క్ చేశాడా?

సినిమా మీద ప్రేమతో ఎంత రీస్క్ చేయడానికైనా వెనకాడని నటీనటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కింగ్ నాగార్జున కూడా ఒకరు. ఆయనకు నటన అంటే ఎంతో ఇష్టం.. పాత్రలకోసం ప్రాణాలకు తెగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నమయ్య సినిమా కోసం నాగార్జున ఏం చేశారో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jul 15 2025, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Nagarjuna Facebook

సినిమాల్లో నటించడం అంటే ఏదో చేస్తున్నా అన్నట్టు కాదు.. అవకాశం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటేనే స్టార్లు అవ్వగలరు. నటనతో మెప్పించగలిగితేనే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగలరు. కొంత మంది స్టార్స్ అయితే సినిమా అంటే చాలు మైమరచిపోతుంటారు. సినిమా కోసం ఏ రిస్క్ చేయడానికైనా వెనకాడరు. ఎలాంటి ప్రయోగమైనా, ఎంత ప్రమాదం అయినా అస్సలు వెనకడుగు వేయరు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ,రామ్ చరణ్, విశాల్ లాంటి స్టార్స్ ఈ కోవలోకే వస్తారు. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఇలాంటి రిస్క్ షార్టు చాలా చేశారు. మరీ ముఖ్యంగా అన్నమయ్యసినిమా కోసం నాగార్జున చేసిన సాహసం అంతా ఇంతా కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Nagarjuna Facebook / sun nxt

నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అన్నమయ్య. టాలీవుడ్ మన్మధుడు, యువసామ్రాట్ గా ఉన్న నాగార్జున ఒకేసారి పరమ భక్తులు, సంకీర్తనాచార్యుడు అన్నమయ్య పాత్ర చేస్తున్నాడు అంటే అది రిస్క్ అన్నారు చాలామంది. ఆయన ఇమేజ్ కు ఆ పాత్ర సరిపోతుందా, స్టైలీష్ గా ఉండే నాగార్జున భక్తి రసం పండించగలరా అని అనుమానాలు ఉండేవి. 

కానీ అన్నమయ్య సినిమాలో అందరి అనుమానాలు పటాపంచలు చేశారు నాగ్. అసలు ఆ పాత్రకు సరిపోతాడా అని అనుమానం వ్యక్తి చేయడం కాదు.. ఆసినిమాతోనే కింగ్ కెరీర్ మరో మలుపు తిరిగింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

35
Image Credit : Sun nex page

ఒక రకంగా తిరుమల తిరుపతికి మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది అన్నమయ్య సినిమా. అన్ని పాత్రలు అద్భుతంగా సెట్ అవ్వడం. వెంకటేశ్వరుడిగా సుమన్ ను చూసి పులకరించిపోయారు భక్తులు. వాగ్గేయకారుడిగా నాగార్జున పర్ఫామెన్స్ కు 100 మార్కులు పడ్డాయి. 

ఈ సినిమాను, ఆ పాత్రను ఛాలెంజ్ గా తీసుకుని చేశారు నాగార్జున. ఇక ఈసినిమా ప్రయాణం అంత సాఫీగా సాగిపోలేదు. ఈ పాత్ర కోసం చాలా రిస్క్ లు చేశారు నాగ్. మరీ ముఖ్యం క్లైమాక్స్ సీన్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఈవిషయాన్ని సౌందర్యలహరి ప్రోగ్రామ్ లో నాగార్జున, రాఘవేంద్ర రావు స్వయంగా వెల్లడించారు.

45
Image Credit : Sun Nex page

ఈ సినిమా క్లైమాక్స్ లో అన్నమయ్య పండు ముసలి అవుతాడు. మోక్షం కోసం దేవునితో మాట్లాడే సీన్. చాలా లెన్తీ సీన్ అది. అయితే అంత సేపు నాగార్జున వాయిస్ వణుకుతూ, ముసలి వాయిస్ రావాలి. కాని అది హీరోకు సాధ్యం అవుతందో లేదో, అతన్ని ఇబ్బందిపెట్టడం ఎందుకు అని ఎస్పీ బాలుచేత ఈసీన్ కు డబ్బింగ్ చెప్పిద్దాం అనుకున్నాడట. 

కానీ సినిమా అంతా తానే డబ్బింగ్ చెప్పి.. ఆ ఒక్క సీన్ కు వేరే వాళ్తతో చెప్పించడం ఎందుకు నేనే చెపుతాను అని నాగార్జున అన్నారట. అయితే ముసలి గొంతుతో మాట్లాడటం కింగ్ కు చాలా కష్టంగా అనిపించింది. అప్పటికి నాగార్జున 38 ఏళ్ల యంగ్ ఏజ్ లోనే ఉన్నారు. దాంతో ఈ పాత్రకు ఎలాగైనా డబ్బింగ్ చెప్పాలని, డబ్బింగ్ ముందు రోజు రాత్రి దాదాపు 1 కిలో వరకూ ఐస్ క్యూబ్స్ తినేశాడట.

55
Image Credit : Asianet News

సినిమాలో ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం అంత రిస్క్ చేసి కిలో ఐస్ తినేయడం అంటే అంత సులువైన విషయం కాదు. అలా ఐస్ తినడంతో మరుసడి రోజు నాగార్జున గొంతు పూర్తిగా మారిపోయింది. అప్పుడు డబ్బింగ్ చెప్పడం సులువుగా మారింది. ఇలా అన్నమయ్య సినిమా కోసం ఇలాంటి రిస్క్ లు చాలా చేశారు నాగార్జున. అంత కష్టపడ్డందుకు అన్నమయ్య సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. 

ఇప్పటికీ 65 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ... దూసుకుపోతున్నాడు నాగార్జున. వెండితెరతో పాటు బిగ్ బాస్ లాంటి షోలతో బుల్లితెరపై కూడా నాగార్జున కింగ్ లా దూసుకుపోతున్నాడు. ఇక నాగ్ నటించిన కుబేర సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక రజనీకాంత్ తో నాగార్జున కలిసి నటించిన కూలి సినిమా రిలీజ్ కు రెడీవుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329 & 387
AUSAUS
(57.0 ov) 429 & 111/9
Day 5 - Session 2
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Palak Tiwari Net Worth: స్టార్ హీరో కొడుకుతో బ్రేకప్.. శ్వేతా తివారీ కూతురు ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Actor Naresh: తరుణ్, ఎన్టీఆర్ వచ్చాక అనుమానం మొదలైంది.. కృష్ణ, విజయ నిర్మల ఆ ఖర్చు భరించారు
Recommended image3
Sai Pallavi: జీవితంలో భయంకరమైన సంఘటన, సాయి పల్లవి హనుమాన్ చాలీసా నేర్చుకోడానికి కారణం అదే?
Related Stories
Recommended image1
బిగ్ బాస్ తెలుగు 9 లో పుష్ప 2 సింగర్, ఫోక్ సాంగ్స్ తో హౌస్ లో మోత మోగించబోతున్న గాయని ?
Recommended image2
కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ కాంబోలో 60 సినిమాలు, 35 ఏళ్ల స్నేహం, విషాదంలోను వీడని అనుబంధం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved