- Home
- Telangana
- Telangana Rains : తెలుగు ప్రజలారా రెడీగా ఉండండి... భారీ వర్షాలు లోడింగ్, ఎప్పట్నుంచి కురుస్తాయంటే...
Telangana Rains : తెలుగు ప్రజలారా రెడీగా ఉండండి... భారీ వర్షాలు లోడింగ్, ఎప్పట్నుంచి కురుస్తాయంటే...
తెలుగు రాష్ట్రాల్లో ఇకపై భారీ వర్షాలు కురుస్తాయంటూ గుడ్ న్యూస్ చెబుతోంది వాతావరణ శాఖ. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఈ వర్షాలు ఎప్పటినుండి మొదలుకానున్నాయో తెలుసా?

మరో రెండ్రోజుల్లో వర్షాలే వర్షాలు
Telugu States Rains : తెలుగు ప్రజలు వర్షాల కోసం ఆకాశంవైపు ఎదురుచూసే రోజులకు తెరపడనుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరో రెండ్రోజుల్లో వాతావరణ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని... భారీ వర్షాలకు అనుకూలంగా వాతావరణం రెడీ అవుతోందని వెల్లడించింది. ఈ వార్త వర్షాలు లేకపోవడంతో కంగారుపడుతున్న తెలుగు ప్రజలకు ఊరట కలిగిస్తోంది. వర్షాకాలం మొదలై దాదాపు రెండునెలల కావస్తోంది... ఇప్పటికి వరుణుడు తెలుగు రాష్ట్రాలను వరుణుడు కరుణిస్తున్నాడు.
జులై 17 నుండి జోరువానలు
తెలంగాణలో జూన్ నెలంతా వర్షాలు లేవు... దీంతో ప్రజలు జులైపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ నెలలో కూడా మొదటి పదిహేను రోజుల్లో వర్షాల జాడలేదు.. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది. ఈ సమయంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెబుతోంది.
జులై 17 నుండి తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని... పోనుపోను ఇవి అతిభారీ వర్షాలు, కుండపోత వానలుగా మారతాయని వెల్లడించింది. అయితే మరో రెండ్రోజులు (జులై 15,16) మాత్రం ఉక్కపోత, వేడి వాతావరణమే ఉంటుందని... అక్కడక్కడా చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశాలన్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది.
హైదరాబాద్ తో అన్నిజిల్లాల్లో వర్షాలు
రుతుపవనాలు బలపడటంతో పాటు వరుసగా అల్పపీడనాలు ఏర్పడటంతో వర్షాలు జోరందుకోనున్నాయని తెలిపింది. జులై 17 నుండి హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్నిజిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఇప్పటికే పంటలువేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్నవారు, వేయడానికి భూమిని సిద్దం చేసిన రైతులను ఈ వర్ష సమాచారంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జులై 17 నుండి 28 వరకు అంటే పదిరోజులు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదవగా ఇకపై ఆ పరిస్థితి ఉండదని... భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మంగళవారం తెలంగాణ వర్షాలు
తెలంగాణలో మరో రెండ్రోజులు (జులై 15,16) వర్షాలు కురిసే అవకాశం లేదని... వేడి, ఉక్కపోత కొనసాగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ(మంగళవారం) సాయంత్రం సమయంలో కొన్ని జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్ మహబూబ్ నగర్ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయట.
మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మరో రెండ్రోజులు వేడి, ఉక్కపోత వాతావరణమే ఉంటుందని... అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జులై 17 నుండి ఇక్కడ కూడా వర్షాలు జోరందుకుంటాయని... ఇక ఈ నెలంతా భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది.
ఇవాళ (మంగళవారం) ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక ఉభయ గోదావరితో పాటు గుంటూరు, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూల్ జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.