Visakhapatnam : విశాఖలో దుమ్మురేపుతున్న జియో
Visakhapatnam: ట్రాయ్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ డ్రైవ్ టెస్టులో విశాఖపట్నంలో జియో 204.91 Mbps డౌన్‌లోడ్ స్పీడ్‌తో దుమ్మురేపింది. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే జియో వాయిస్, డేటా సేవలలో టాప్ లో కొనసాగుతోంది.

విశాఖపట్నంలో టాప్ లో జియో
ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తన సేవలతో మరింతగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా విశాఖపట్నంలో తన అసాధారణ మొబైల్ నెట్‌వర్క్ పనితీరుతో మరోసారి రికార్డు సృష్టించింది.
టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) నిర్వహించిన తాజా ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ (IDT) అదరగొట్టింది. ట్రాయ్ ఫలితాల ప్రకారం, జియో అద్భుతమైన పనితీరుతో ఇతర టెల్కోలను వెనక్కి నెట్టింది. విశాఖ నగరంలో మొబైల్ వినియోగదారులకు అత్యుత్తమ ఎంపికగా నిలిచింది.
డౌన్‌లోడ్ తుఫాను వేగంతో జియో రికార్డు
ట్రాయ్ (TRAI) విడుదల చేసిన నివేదిక ప్రకారం, జియో తన 4G నెట్‌వర్క్‌లో గరిష్టంగా 204.91 Mbps సగటు డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఇది విశాఖ నగరంలోని అన్ని టెలికాం ఆపరేటర్లలో అత్యధికంగా నమోదు అయిన స్పీడ్ గా ఉంది.
ఈ వేగం వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, యాప్ డౌన్‌లోడ్‌లు, బ్రౌజింగ్ వంటి అన్ని డేటా ఆధారిత సేవలను వేగవంతంగా అందించేలా చేస్తోంది.
తక్కువ లేటెన్సీతో మెరుగైన అనుభవం అందిస్తున్న జియో
జియో నెట్‌వర్క్ లో అత్యంత తక్కువ లేటెన్సీ నమోదు కావడం, వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని కలిగిస్తోంది. డేటా ప్యాకెట్ల ట్రాన్స్‌మిషన్ సమయంలో గణనీయమైన తక్కువ సమయం ఉండటంతో రియల్-టైమ్ అప్లికేషన్లు.. ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్సింగ్, ఆన్‌లైన్ గేమింగ్ లలో అంతరాయంలేని అనుభూతిని అందిస్తోంది.
విశాఖలో వాయిస్ సేవలలోనూ టాప్ లో జియో
డేటా సేవలతో పాటు, వాయిస్ సేవలలో కూడా జియో తన ప్రాముఖ్యతను నిరూపించింది. ట్రాయ్ నివేదిక ప్రకారం, జియో సేవలు అత్యధిక కాల్ సెటప్ సక్సెస్ రేటు, తక్కువ కాల్ సెటప్ టైమ్, గణనీయంగా తక్కువ కాల్ డ్రాప్ రేటు, స్పష్టమైన వాయిస్ క్వాలిటీని కలిగి ఉన్నాయి. దీంతో వైజాగ్ లో వాయిస్ కాల్ సేవలలో కూడా జియో టాప్ లో నిలిచింది.
విస్తృత డ్రైవ్ టెస్ట్ కవరేజ్ కలిగిన జియో
ఈ ఇండిపెండెంట్ డ్రైవ్ టెస్ట్ ను విశాఖపట్నం అంతటా విస్తృత స్థాయిలో నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో టెస్టింగ్ చేసిన ఫలితాల ప్రకారం, జియో ప్రతిచోటా తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
ఇది జియోను విశాఖపట్నం మొబైల్ వినియోగదారులకు అత్యుత్తమ ఎంపికగా నిలిపింది. ఇతర నెట్ వర్క్ ల కంటే బలంగా తన సేవల విషయంలో టాప్ లో నిలిచింది.
డిజిటల్ భారత్ దిశగా మరింత ముందడుగు
ఈ తాజా ఫలితాలతో జియో తన లక్ష్యమైన డిజిటల్ భారత్ కలకు మరొక అడుగు ముందుకేసింది. అత్యుత్తమ నెట్‌వర్క్ సేవలతో మిలియన్ల మందికి సాంకేతిక పరిజ్ఞానం సమీపంలోకి తీసుకురావడంలో జియో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
డేటా వేగం, కాల్ క్వాలిటీ, నెట్‌వర్క్ విశ్వసనీయత విషయంలో జియో చూపిస్తున్న అగ్రస్థాయి పనితీరు, భారతీయ టెలికాం రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తోంది.