MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • ENG vs IND: ఉత్కంఠ‌ను పెంచుతున్న మాంచెస్టర్ టెస్టు.. బుమ్రా ఆడ‌తారా? డాసన్ వన్‌మోర్ ఛాన్స్ !

ENG vs IND: ఉత్కంఠ‌ను పెంచుతున్న మాంచెస్టర్ టెస్టు.. బుమ్రా ఆడ‌తారా? డాసన్ వన్‌మోర్ ఛాన్స్ !

ENG vs IND 4th Test Preview: మాంచెస్టర్‌లో జూలై 23న ప్రారంభమయ్యే 4వ టెస్టులో బుమ్రా ఎంపిక భార‌త్ కు కీలకం. డాసన్ 8 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ నుంచి టెస్ట్‌ పిలుపు అందుకున్నాడు. హీట్ పెంచిన లార్డ్స్ టెస్ట్ త‌ర్వాత జ‌రుగుతున్న ఈ మ్యాచ్ ఉత్కంఠ‌ను పెంచుతోంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 15 2025, 11:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉత్కంఠగా సాగుతున్న భార‌త్   ఇంగ్లాండ్ టెస్టు సిరీస్
Image Credit : ANI

ఉత్కంఠగా సాగుతున్న భార‌త్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్

ఇంగ్లాండ్ స్వదేశంలో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, భార‌త్ అద్భుత‌మైన పోరాటంతో ఈ సిరీస్ మ‌రింత ఉత్కంఠ‌గా ముందుకు సాగుతోంది. లార్డ్స్ టెస్టులో కేవ‌లం 22 పరుగుల తేడాతో భార‌త్ ఓడిపోయింది.

ఈ విజయంతో ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో నాల్గో టెస్టుకు సిద్ధంగా ఉంది. జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభమయ్యే నాలుగవ టెస్టులో అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు భారత జట్టు మాత్రం ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందేనన్న ఒత్తిడిలో ఉంది, లేదంటే సిరీస్ చేజారిపోతుంది. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికపై కూడా ప్రభావం చూపుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత జట్టులో మార్పులు.. బుమ్రా ప్లేయింగ్ 11లో ఉంటారా?
Image Credit : ANI

భారత జట్టులో మార్పులు.. బుమ్రా ప్లేయింగ్ 11లో ఉంటారా?

భారత జట్టు విషయానికి వస్తే, జస్ప్రీత్ బుమ్రా ఎంపికపై స్పష్టత లేదు. రెండో టెస్టు విశ్రాంతి తర్వాత మూడో టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఈ సిరీస్ లో నాల్గో మ్యాచ్ కీల‌కం కానుంది. కాబ‌ట్టి బుమ్రా జ‌ట్టులో ఉండ‌టం కీల‌కం. 

అయితే, అత‌ని శారీరక స్థితిని బట్టి అతడి స్థానం నిర్ణయించ‌నున్నారని స‌మాచారం. వ‌ర్క్ లోడ్ కార‌ణంగా మూడు టెస్టులు మాత్ర‌మే ఆడ‌నున్నాడ‌ని ఇప్ప‌టికే భార‌త క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. బుమ్రా లేకపోతే ప్రసిద్ధ్ క్రిష్ణ లేదా అర్షదీప్ సింగ్‌కు అవకాశం ల‌భించ‌నుంది.

బ్యాటింగ్‌లో మాత్రం నంబర్ 3 స్థానంలో మార్పు ప‌క్కాగా క‌నిపిస్తోంది. కరుణ్ నాయర్ నుంచి ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో, సాయి సుదర్శ‌న్ కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. గిల్ల్ సారథ్యంలో జట్టు సమతుల్యత కోసం ఇదే సరైన మార్గమని భావిస్తున్నారు.

నాల్గో టెస్టుకు భార‌త ప్లేయింగ్ 11 అంచ‌నా జ‌ట్టు

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుద‌ర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, బుమ్రా/ప్రసిద్ధ్, మహ్మద్ సిరాజ్.

35
ఇంగ్లాండ్ జట్టులో మార్పులు.. స్పిన్నర్ డాసన్ సెన్సేషనల్ రీ ఎంట్రీ
Image Credit : ANI

ఇంగ్లాండ్ జట్టులో మార్పులు.. స్పిన్నర్ డాసన్ సెన్సేషనల్ రీ ఎంట్రీ

ఇంగ్లాండ్ మాత్రం దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగనుంది. అయితే లార్డ్స్ టెస్టులో గాయపడ్డ స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులో ఉండే అవకాశాలు తగ్గిపోయాయి. అతని స్థానంలో ఎనిమిదేళ్ల తర్వాత లియామ్ డాసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. 

2017 తర్వాత టెస్టు ఆడిన డాసన్.. 2023, 2024లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శనలతో PCA ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు. ఇప్పుడు అత‌నికి జ‌ట్టును పిలుపు వ‌చ్చింది. గస్ అట్కిన్సన్ కూడా టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ చేసే అవకాశముందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

మాంచెస్ట‌ర్ టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 అంచ‌నా జ‌ట్టు

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రుక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, డాసన్/అట్కిన్సన్.

45
మాంచెస్టర్ గ్రౌండ్ రికార్డులు ఎలా ఉన్నాయి?
Image Credit : ANI

మాంచెస్టర్ గ్రౌండ్ రికార్డులు ఎలా ఉన్నాయి?

మాంచెస్ట‌ర్ లోని ఒల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ఇప్పటివరకు 85 టెస్టులు జరగగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 32 విజయాలు సాధించాయి. రెండవ బ్యాటింగ్ జట్లు 17 మ్యాచ్‌లు గెలిచాయి. 36 టెస్టులు డ్రాగా ముగిశాయి. టాస్ కీల‌కం కానుంద‌ని చెప్ప‌వ‌చ్చు. టాస్ గెలిచిన జట్లు 29 విజయాలు సాధించాయి.

  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 311 ప‌రుగులు, ఆస్ట్రేలియా ఆటగాడు ఆర్.బీ. సింప్సన్ (1964)
  • అత్యధిక వికెట్లు (ఇన్నింగ్స్‌లో): 10/53, జేసీ లేకర్ (1956)
  • అత్యధిక వికెట్లు (మ్యాచ్‌లో): 19/90 , జేసీ లేకర్ (1956)
  • అత్యధిక జట్టు స్కోరు: 656/8 డిక్లేర్, ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్
  • తక్కువ స్కోరు: 58 ప‌రుగులు, భారత జట్టు (1952)
55
జ‌ట్ల మార్పులు ఫలితంపై ప్రభావం చూపేనా?
Image Credit : Google

జ‌ట్ల మార్పులు ఫలితంపై ప్రభావం చూపేనా?

మాంచెస్ట‌ర్ టెస్ట్ భారత జట్టుకు కీలకం. గెలిస్తే సిరీస్ సమం అవుతుంది, లేదంటే సిరీస్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళుతుంది. ఆటగాళ్ల ఎంపిక, గణాంకాలు, పిచ్ పరిస్థితులు.. ఇవన్నీ ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించనున్నాయి. అంత తేలికగా తీసుకోకూడదని భారత్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. 

మాంచెస్టర్‌లోని పేస్-సహజ వాతావరణం బుమ్రా, ఆర్చర్ వంటి బౌలర్లకు ప్లస్ అయ్యే అవకాశముంది. డబ్ల్యూటీసీ పాయింట్లలో కూడా ఈ ఫలితం ప్రభావం చూపనుంది. ఇక టెస్టు ముగిసే సమయానికి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో ఎవరు ముందుంటారో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
West Indies: వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ టీమ్.. 27 పరుగులకే ఆలౌట్.. ఇలా త‌యార‌య్యారేంది సామీ !
Recommended image2
Hat Tricks: బుమ్రా నుండి బోలాండ్ వరకు.. డబ్ల్యూటీసీలో హ్యాట్రిక్ కొట్టిన ప్లేయ‌ర్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved