తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:51 PM (IST) May 09
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అన్ని ప్రాంతాలలో ఆరోగ్య సేవలు, అత్యవసర ప్రతిస్పందనలు అంతరాయం లేకుండా కొనసాగేలా చూస్తోంది.
పూర్తి కథనం చదవండి11:24 PM (IST) May 09
పాకిస్తాన్ రక్షణా మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, ఇండియా ఒంటరిగా ఉందని, ఇజ్రాయెల్‌తో కలిసి ఇస్లాంకి వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. పాకిస్తాన్‌కి చాలా దేశాల మద్దతు ఉందని చెప్పుకున్నారు.
పూర్తి కథనం చదవండి11:09 PM (IST) May 09
భారతపాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య నిత్యావసరాల ధరల పెరగకుండా.. వాటి నిల్వలను సమీక్షించాలని.. బ్లాక్ మార్కెట్, దళారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. భారత–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
10:54 PM (IST) May 09
పాకిస్థాన్ బరితెగిస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులు నిర్వహిస్తే. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ సామాన్యులపై దాడికి దిగుతోంది. వరుసగా రెండో రోజు పాకిస్థాన్ దాడులకు దిగింది. తాజాగా శుక్రవారం రాత్రి మరోసారి డ్రోన్ దాడులతో రెచ్చిపోయింది.
10:23 PM (IST) May 09
జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపోరా ఎయిర్ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు వినిపించాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో అలర్ట్ సైరన్లు మోగించారు. పెద్ద ఎత్తున విద్యుత్ నిలిచిపోయింది.
09:32 PM (IST) May 09
భారత్ పై దాడికి పాక్ సైన్యం 400 డ్రోన్‌లను మోహరించగా భారత సైన్యం వాటిని కూల్చివేసింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా 24 విమానాశ్రయాలను మూసివేసారు. ఈ ఎయిర్ పోర్ట్స్ ఏవి? ఎన్నిరోజులు మూసేస్తారు? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:32 PM (IST) May 09
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు వెంట పాకిస్థాన్ తరఫు నుంచి డ్రోన్లు భారత భూభాగంలోకి చొచ్చుకువస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. తాజా దాడులతో పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
09:22 PM (IST) May 09
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సరైనదే అని ఆ దేశ యువతే ఒప్పుకుంటోంది. ముందుకు పాక్ దాడి మొదలుపెట్టింది... ఇప్పుడు ఇండియా దాడి చేస్తే శాంతి కావాలంటే ఎలా? 26 మంది చనిపోయినప్పుడు శాంతి ఎక్కడ ఉంది? అని ఓ పాక్ యువకుడు ప్రశ్నించాడు.
పూర్తి కథనం చదవండి08:51 PM (IST) May 09
ఇంట శుభకార్యాలు, కొత్త అవకాశాలు కొన్ని రాశులకు లభించనున్నాయి. మరికొందరికి బంధువులతో వివాదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
పూర్తి కథనం చదవండి08:51 PM (IST) May 09
పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వృద్ధురాలి ప్రేమకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. స్వయంగా భోజనం వడ్డించి, చీర, డబ్బులను అందించాడు ఏపీ డిప్యూటీ సీఎం. ఇంతకీ పవన్ ఈ పని చేయడం వెనకాల అసలు కారణంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
08:23 PM (IST) May 09
పాకిస్తాన్‌తో ఉద్రిక్తత నేపథ్యంలో, భారతీయ సైన్యానికి మద్దతుగా ప్రాదేశిక సైన్యాన్ని మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్వచ్ఛంద సైనిక దళ సభ్యులు పౌర వృత్తుల్లో నిమగ్నమై, అత్యవసర పరిస్థితుల్లో సేవలందిస్తారు.
పూర్తి కథనం చదవండి08:09 PM (IST) May 09
భారత్, పాకిస్థాన్‌ల మద్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. పాకిస్థాన్ దాడులను భారత ఆర్మీ ధీటుగా ఎదురుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
07:53 PM (IST) May 09
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు శనివారం సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గురువారం నుంచే స్టేడియంలో రిహార్సల్స్ ఉత్సాహంగా సాగాయి. వివిధ దేశాల కంటెస్టెంట్లు అందమైన కాస్ట్యూమ్స్‌తో స్టేజ్‌పై తమ నడకలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
07:32 PM (IST) May 09
నల్లగొండ జిల్లా నకిరేకల్ వద్ద ఓ మహిళ కల్లు బాటిళ్లను ఆర్టీసీ బస్సులో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కట్టంగూరులో జరుగుతున్న ఓ వేడుక కోసం ఈ కల్లు తీసుకెళ్లాలనుకున్న ఆమెను బస్సు కండక్టర్, డ్రైవర్ అడ్డుకున్నారు. దీంతో బస్సులో కల్లు తీసుకెళ్లడం నేరమా అన్న చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
06:54 PM (IST) May 09
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో భయానక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ కు చెందిన పలువురు ఉగ్రవాదులు, నేరస్థులు ఆ దేశాన్ని వీడి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి06:20 PM (IST) May 09
షారుఖ్ ఖాన్ దీవానా సీక్వెల్: వస్తున్న నివేదికల ప్రకారం, షారుఖ్ ఖాన్ 32 ఏళ్ల నాటి బ్లాక్ బస్టర్ దీవానా సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాతోనే షారుఖ్ ఖాన్ సినీరంగ ప్రవేశం చేశారు.
పూర్తి కథనం చదవండి
06:20 PM (IST) May 09
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఏపీ డిప్యూటీ కలెక్టర్ను తహసీల్దార్‌గా డిగ్రేడ్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయని అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఒక డిప్యూటీ కలెక్టర్‌ను తహసీల్దార్ హోదాకు డీమోట్ చేయాలని . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
06:01 PM (IST) May 09
Train Ticket: ఒకసారి టికెట్ కొనుగోలు చేసిన తర్వాత అది చిరిగిపోతే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి మీకెప్పుడైనా ఎదురైందా? ఒకవేళ భవిష్యత్తులో ఇలా జరిగితే చిరిగిపోయిన టికెట్ చెల్లుబాటు అవుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:56 PM (IST) May 09
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారతదేశం ప్రతీకార చర్యలు చేపట్టింది. దీంతో, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు అత్యవసర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
పూర్తి కథనం చదవండి05:37 PM (IST) May 09
భారత సైన్యం మరోసారి తన శౌర్యాన్ని చాటింది. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడులు, కాల్పుల విరమణ ఉల్లంఘనలను విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలు ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో ఏం జరిగిందన్న వివరాలను భారత సైన్యం, వాయుసేన, నౌకాదళానికి సంబంధించిన అధికారులు మీడియాకు వివరించారు.
05:09 PM (IST) May 09
నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది రాయల్స్’ సిరీస్ విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో, భూమి పెడ్నేకర్ చిత్రీకరణకు ముందు హీరో ఇషాన్ కట్టర్‌తో సాన్నిహిత్యం పెంచుకోవాలని చిత్ర బృందం సూచించిందని తెలిపింది.
పూర్తి కథనం చదవండి05:02 PM (IST) May 09
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వాయిదా పడిన విషయం తెలిసిందే.మొదట్లో నిరవధిక వాయిదా అన్నారు. కానీ మరో వారం రోజుల్లో మ్యాచ్ లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో IPL 2025 తో కొంతమంది స్టార్ క్రికెటర్లు వీడ్కోలు పలకనున్నారని సమాచారం. వారు ఎవరో చూద్దాం.
పూర్తి కథనం చదవండి04:56 PM (IST) May 09
ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలు భారత సైన్యానికి మద్దతు తెలియజేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి04:37 PM (IST) May 09
భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లను వాయిదా వేసేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఎల్ పాలక మండలి వెల్లడించింది. అయితే తొలుత ఐపీఎల్ మ్యాచ్‌లను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
04:31 PM (IST) May 09
800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీత పాత్రను సాయి పల్లవి పోషించనున్నారు. 2 కోట్ల రూపాయల ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటనను ఆమె తిరస్కరించారు. విదేశాల్లో MBBS పూర్తి చేసిన ఆమె, వైద్య వృత్తిని కాకుండా నటనను ఎంచుకున్నారు.
పూర్తి కథనం చదవండి04:14 PM (IST) May 09
పరిమితికి మించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే ఛార్జ్ పడుతున్న విషయం చాలా మందికి తెలియదు. అవసరాల మేరకు 100, 200 కూడా ఏటీఎం కి వెళ్లి డ్రా చేసేస్తుంటారు. అయితే మే 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి04:11 PM (IST) May 09
భారత్,పాకిస్థాన్‌ల మధ్య జరుగుతోన్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రక్షణ కోసం పోరాడుతూ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు.
04:00 PM (IST) May 09
ప్రముఖ నిర్మాత ఐసరి గణేష్ తన కూతురు ప్రీత వివాహాన్ని చెన్నైలో ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి03:51 PM (IST) May 09
BSNL Mothers Day Offer: మదర్స్ డే సందర్భంగా BSNL తన మూడు బెస్ట్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్‌లపై డిస్కౌంట్ ప్రకటించింది. మాతృ దినోత్సవం మే 11న వస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని BSNL తన అధికారిక X ఖాతా ద్వారా మూడు రీఛార్జ్ ప్లాన్‌లపై 5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి03:13 PM (IST) May 09
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాాడికోసం చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాతి పరిణామాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఈ మేరకు ఆయన దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు.
పూర్తి కథనం చదవండి02:58 PM (IST) May 09
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యాధిపతికి అదనపు అధికారాలను కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
02:51 PM (IST) May 09
ఐసరి గణేష్ కూతురు పెళ్లికి నటుడు రవి మోహన్ కూడా హాజరయ్యారు. ఆయన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఒక మహిళతో కలిసి ఈ పెళ్లికి వచ్చారు.
పూర్తి కథనం చదవండి02:34 PM (IST) May 09
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణశాఖ కీలక సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీడీఎస్ తో పాటు ముగ్గురు సైనికాధిపతులతో సమావేశమయ్యారు. సైనికాధిపతులు యుద్ధ దుస్తుల్లో కనిపించారు.
పూర్తి కథనం చదవండి02:27 PM (IST) May 09
నటి సాయి పల్లవి తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, ఆమె ఆస్తుల విలువ ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:08 PM (IST) May 09
ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఇండిగో 10 నగరాలకు విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఆ నగరాలేవి? ఎప్పటివరకు ఈ ఎయిర్ పోర్ట్ కు ఇండిగో విమాన సర్వీసులు ఉండవు? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి01:57 PM (IST) May 09
Starlink: దేశంలో టెలికాం సేవల్లో కీలక పరిమాణం ఇది. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు వేగంగా అందనున్నాయి. దీనికోసం ఎలాన్ మస్క్ సంస్థ అయిన స్టార్ లింక్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ పరిణామంతో జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ తదితర టెలికాం కంపెనీలు ఇరకాటంలో పడ్డాయి. ఏదిఏమైనా ఇకపై ప్రజలకు పోటాపోటీగా ఇంటర్నెట్ సేవలు అందుతాయన్న మాట.
పూర్తి కథనం చదవండి01:55 PM (IST) May 09
ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి జీవితం, కుటుంబం, జీతం వివరాలు తెలుసుకోండి
పూర్తి కథనం చదవండి01:26 PM (IST) May 09
పాకిస్థాన్ సేనలతో వీరోచితంగా పోరాడుతూ దేశం కోసం కోసం చివరకు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు తెలుగు జవాన్ మురళీ నాయక్. జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్న అతడు యుద్దభూమిలో వీరమరణం పొందాడు.
పూర్తి కథనం చదవండి01:20 PM (IST) May 09
భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జోధ్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుక రాత్రి 9:30 గంటలకే బ్లాక్‌అవుట్ కారణంగా అంధకారంలోకి వెళ్లిపోయింది. మొబైల్ ఫోన్ల వెలుతురులోనే అతిథులు భోజనం చేశారు, వధూవరులు మొబైల్ వెలుతురులోనే తలంబ్రాలు చేసుకున్నారు.
పూర్తి కథనం చదవండి12:56 PM (IST) May 09
భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ పరిస్థితి దిగజారింది. IMF నుండి చైనా, సౌదీ అరేబియా, UAE వరకు అన్ని దేశాల నుండి అప్పులు చేసింది. ఇప్పుడు మళ్ళీ మిత్రదేశాల నుండి అప్పులు అడుగుతోంది.
పూర్తి కథనం చదవండి