MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Travel
  • Train Ticket: ట్రైన్ టికెట్‌ చిరిగిపోతే ప్రయాణం చేయొచ్చా? కొత్త టికెట్ కొనాలా? అధికారుల వివరణ ఇదే

Train Ticket: ట్రైన్ టికెట్‌ చిరిగిపోతే ప్రయాణం చేయొచ్చా? కొత్త టికెట్ కొనాలా? అధికారుల వివరణ ఇదే

Train Ticket: ఒకసారి టికెట్‌ కొనుగోలు చేసిన తర్వాత అది చిరిగిపోతే ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి మీకెప్పుడైనా ఎదురైందా? ఒకవేళ భవిష్యత్తులో ఇలా జరిగితే చిరిగిపోయిన టికెట్ చెల్లుబాటు అవుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 09 2025, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టికెట్ లేకుండా ప్రయాణం చేయడం చట్టరీత్యా నేరం. అందుకే ప్రతి ఒక్కరూ టికెట్ కొనుక్కుంటారు. అయితే అది జేబులో పెట్టుకోవడం, పర్సులో పెట్టుకోవడం, తీయడంలో పొరపాటున చిరిగిపోయిందనుకోండి. అది చెల్లుబాటు అవుతుందా లేదా? ఇలాంటి పరిస్థితి కూడా ఎదుర్కొన్న వారు ఉంటారు. అయితే చాలా మంది టికెట్ చెల్లుబాటు కాదని, ఫైన్ కట్టాల్సి వస్తుందని వేరే టికెట్ తీసుకుంటారు. ఇలా చేయక్కరలేదని, చిరిగిపోయిన టికెట్ కూడా చెల్లుబాటు అవుతుందని, కాని కొన్ని నిబంధనలు పాటించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీరు కొన్న టికెట్ పొరపాటున చిరిగాపోయిందనుకోండి మీకు కంగారు పడాల్సిన పని లేదు. అది చెల్లుబాటు అవుతుంది. అయితే ఆ టికెట్ చిరిగిపోయినా వాటిపై వివరాలు చదవగలిగేలా ఉండాలి. అంటే టికెట్ నంబర్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? టికెట్ ఫెయిర్, స్టాంప్ సింబల్ సరిగ్గా కనిపించాలి. వీటిల్లో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా అధికారులు టికెట్ తీసుకోరు. అది పనిచేయదని చెప్పేస్తారు. దీంతో మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. 

35

ఇలా చేస్తే మేలు..

టికెట్ జస్ట్ ఒక పేపర్. అందువల్ల అది ఏ పరిస్థితుల్లో అయినా చిరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే టికెట్ కొన్న వెంటనే ముఖ్య సమాచారం కనిపించేలా ఫోటో తీసి పెట్టుకోండి. అప్పుడు టికెట్ చిరిగిపోయినా డూప్లికేట్ మీ దగ్గర ఉంటుంది కనుక రెండింటినీ చూసి టీటీఈ మీకు ఫైన్ వేయకుండా వదిలేస్తారు. 

45

డిజిటల్ టికెట్స్ అయితే బెటర్

ఇప్పుడంతా డిజిటల్ కరెన్సీ, డిజిటల్ టెక్నాలజీ కాబట్టి టికెట్స్ ఆన్ లైన్ లో తీసుకోవడం బెటర్. పొరపాటున టికెట్ డిలీట్ అయినా రైల్వే వెబ్ సైట్ లో, యాప్ లో భద్రంగా ఉంటుంది. దాని మళ్ళీ తీసుకుంటే సరిపోతుంది. 

55

టికెట్ లేకుండా ప్రయాణం అస్సలు చేయకండి. జస్ట్ ఫైన్ కడితే సరిపోతుందిలే అనుకున్నారా? ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒక్కోసారి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడొచ్చు. జనరల్ టికెట్ తో పోయే దానికి రూ.వేలల్లో ఫైన్, రెండు మూడు నెలలు జైలు శిక్ష వరకు తెచ్చుకోవడం అవసరమా?

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !
Recommended image2
పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి
Recommended image3
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Related Stories
Recommended image1
21 రోజుల్లో 13 దేశాలు చుట్టే అద్భుత రైలు ప్రయాణం! మీరు రెడీనా?
Recommended image2
2 నిమిషాల్లో ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి! సీక్రెట్ ట్రిక్స్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved