ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఇండిగో 10 నగరాలకు విమానాల రాకపోకలను నిలిపివేసింది. ఆ నగరాలేవి? ఎప్పటివరకు ఈ ఎయిర్ పోర్ట్ కు ఇండిగో విమాన సర్వీసులు ఉండవు? అనేది ఇక్కడ తెలుసుకుందాం.  

ఇండియా-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇండిగో ఎయిర్ లైన్స్ 10 నగరాలకు విమానాలను రద్దు చేసింది. ఈ నగరాల నుండి మే 10, 2025 రాత్రి 11:59 వరకు ఎలాంటి విమానాలు నడపబోమని తెలిపింది. ప్రయాణికుల భద్రతే ముఖ్యమని ఇండిగో సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికానెర్, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, రాజ్‌కోట్ నగరాలకు రాకపోకలు సాగించే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

Scroll to load tweet…

10 నగరాలకు విమానాలు రద్దు

పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నామని ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. నిరంతరం తాజా సమాచారం అందిస్తూనే ఉంటామన్నారు. మీ ప్రయాణంలో ఏమైనా మార్పులుంటే సహాయం కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని తెలిపింది. 

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ మంగళవారం అర్ధరాత్రి 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభించింది. దీని తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా శ్రీనగర్ విమానాశ్రయాన్ని సాధారణ ప్రయాణికుల రాకపోకలను నిలిపివేసారు. ఇక ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య పరస్పర మిస్సైల్స్, డ్రోన్ దాడుల నేపథ్యంలో మరిన్ని విమానాశ్రాయలకు రాకపోకలు నిలిపివేసారు.