MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • ATMలలో ఉచితంగా ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చు? కొత్త లిమిట్ ఇదే

ATMలలో ఉచితంగా ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చు? కొత్త లిమిట్ ఇదే

పరిమితికి మించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే ఛార్జ్ పడుతున్న విషయం చాలా మందికి తెలియదు. అవసరాల మేరకు 100, 200 కూడా ఏటీఎం కి వెళ్లి డ్రా చేసేస్తుంటారు. అయితే మే 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 09 2025, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ATM నుండి కొన్ని సార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు. ఆ తర్వాత అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని చాలా మందికి తెలియదు. అయినా ప్రస్తుత బిజీ లైఫ్ లో డిజిటల్ పేమెంట్స్ నే ఎక్కువ మంది చేస్తున్నారు. రోడ్డు పక్కన టీ స్టాల్ అయినా, ఆటో, బస్సు ప్రయాణాలకు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. వేగవంతమైన లావాదేవీల కోసం ప్రజలు ఇప్పుడు UPI ద్వారా చెల్లించడానికి ఇష్టపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇప్పటికీ డబ్బులు డ్రా చేస్తున్నారు

బ్యాంకులు ఇప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఇంటి వద్దకే వచ్చి కూడా సేవలను అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ రోజువారీ అవసరాల కోసం డబ్బు తీసుకోవడానికి చాలా మంది ఇప్పటికీ ATMలపై ఆధారపడుతున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు డబ్బు చేతికి వస్తుంది. ఏటీఎంలు 24/7 అందుబాటులో ఉంటాయి.

కానీ ATMలను వినియోగించుకోవడం పూర్తిగా ఉచితం కాదని చాలా మందికి తెలియదు. మీరు తరచుగా ATMల నుండి డబ్బులు తీసుకుంటే ఒక నెలలో మీరు ఎన్ని ఉచిత లావాదేవీలు చేయొచ్చు. పరిమితిని మించిపోతే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Related Articles

Related image1
ఆహా.. ఇకపై మీ ఊర్లో కూడా ఫుల్ ఇంటర్నెట్: స్టార్‌లింక్‌కు అనుమతిచ్చిన భారత ప్రభుత్వం
35

మే 1, 2025 నుండి కొత్త ATM ఛార్జీలు

మే 1, 2025 నుండి ATM వినియోగానికి సంబంధించిన కొత్త నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలులోకి తీసుకొచ్చింది. ఒక్కో బ్యాంకు ఒక్కోలా మనీ విత్ డ్రాయల్ కి లిమిట్ పెట్టాయి. వాటి లిమిట్ దాటితే ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తారు. ఇప్పుడు ఆ ఛార్జీలు పెంచారు.

గతంలో బ్యాంకులు పరిమితిని మించిన ఒక లావాదేవీకి రూ.21 వసూలు చేసేవి. కానీ కొత్త నిబంధన ప్రకారం ఈ ఛార్జీ ఇప్పుడు లావాదేవీకి రూ.23కి పెంచారు. 

45

నగరాలను బట్టి ఛార్జ్ మారుతుంది

నెలకు ఉచిత ATM మనీ విత్ డ్రా సదుపాయాల సంఖ్య బ్యాంకును బట్టి, నగరాన్ని బట్టి కూడా మారుతుంది. మీరు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రో నగరాల్లో నివసిస్తుంటే నెలకు మూడు ఉచిత ATM నగదు ఉపసంహరణలను పొందవచ్చు.

అయితే మీరు చిన్న నగరాలు లేదా మెట్రో కాని ప్రాంతాల్లో నివసిస్తుంటే మీరు నెలకు ఐదుసార్లు ఉచితంగా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితిని మించిపోయిన తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి కొత్త రూ.23 ఛార్జీ వర్తిస్తుంది.

55

బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్

డబ్బులు తీసుకోవడానికి మాత్రమే ఛార్జీలు వర్తించవు. మీ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి లేదా మినీ స్టేట్‌మెంట్ పొందడానికి మీరు మీ సొంత బ్యాంకు కాకుండా వేరే బ్యాంకు ATMని ఉపయోగిస్తే మీకు నామమాత్రపు ఛార్జీ కూడా విధిస్తారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
ఆహా.. ఇకపై మీ ఊర్లో కూడా ఫుల్ ఇంటర్నెట్: స్టార్‌లింక్‌కు అనుమతిచ్చిన భారత ప్రభుత్వం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved