భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తత వాతావరం కొనసాగుతోంది. పహల్గాం దాడి తర్వాత ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో ఉంది. ఇక ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:55 PM (IST) Apr 29
ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీపై 14 పరుగుల తేడాతో గెలుపొందింది.
పూర్తి కథనం చదవండి11:25 PM (IST) Apr 29
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ త్వరలోనే చీఫ్ జస్టిన్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా స్థానంలో త్వరలోనే రిటైర్ కానున్నారు... ఆయన స్థానంలో జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
పూర్తి కథనం చదవండి
11:07 PM (IST) Apr 29
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో చమీర అద్భుత క్యాచ్ అందుకున్నాడు. కేకేఆర్ బ్యాట్స్‌మన్ అనుకుల్ రాయ్ భారీ షాట్ ఆడగా, బౌండరీ లైన్ వద్ద చమీర అమాంతం గాల్లోకి దూకి క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. చమీర ఫీల్డింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు.
పూర్తి కథనం చదవండి10:30 PM (IST) Apr 29
పహల్గాం ఉగ్రదాడి జరిగి వారం రోజులు గడిచింది. ఈ దాడి భారత్ ను కాదు పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బతీసింది... అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:06 PM (IST) Apr 29
అమీషా పటేల్ సంజయ్ దత్, మాన్యత దంపతులకు బేబీ షవర్ ఏర్పాటు చేశారు. పిల్లలు పుట్టిన సందర్భంగా ఆ దంపతులు ఆమెకు గీత, ఖురాన్ పంపారు. సంజయ్, రితిక్, సల్మాన్ ల బంధాల గురించి కూడా అమీషా మాట్లాడారు.
పూర్తి కథనం చదవండి10:06 PM (IST) Apr 29
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలకు సర్వం సిద్దమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
పూర్తి కథనం చదవండి09:54 PM (IST) Apr 29
కాజోల్, అజయ్ దేవగన్ ల కూతురు నైసా దేవగన్, ఇటీవల మనీష్ మల్హోత్రా లెహంగాలో మెరిసిపోయింది. దీంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ గురించి ఊహాగానాలు వెల్లువెత్తాయి.
పూర్తి కథనం చదవండి09:34 PM (IST) Apr 29
పాకిస్తానీ సినిమాల్లో, సీరియల్స్‌లో నటించి సంపాదించిన భారతీయ నటులు ఎవరో చూద్దాం.
పూర్తి కథనం చదవండి09:24 PM (IST) Apr 29
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నియమితులయ్యారు. కొలిజియం ఆయన పేరును సిపారసు చేయగా తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
పూర్తి కథనం చదవండి09:18 PM (IST) Apr 29
పుష్ప 2 చిత్రం రిలీజ్ టైంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనని ఎవరూ మరచిపోలేరు.
పూర్తి కథనం చదవండి08:44 PM (IST) Apr 29
పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఉగ్రవాదుల చర్యని, పాకిస్తాన్ తీరుని ఎండగడుతూ దేశ ప్రజలు పలు చోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి08:44 PM (IST) Apr 29
కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో చర్చించారు.
పూర్తి కథనం చదవండి07:48 PM (IST) Apr 29
భారతదేశంలో రీమేక్ సినిమాల ట్రెండ్ చాలా కాలంగా ఉంది. చాలా మంది నటులు ఇతర భాషల సినిమాలను కాపీ కొట్టి స్టార్లు అయ్యారు. కానీ ఇప్పటివరకు ఒక్క రీమేక్ కూడా చేయని 8 మంది నటుల గురించి మేము మీకు చెబుతున్నాము...
పూర్తి కథనం చదవండి07:45 PM (IST) Apr 29
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిద దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యాయి. ఈ క్రమంలో మోదీ కీలక ప్రకటన చేసారు.
పూర్తి కథనం చదవండి07:23 PM (IST) Apr 29
పెరిగిన సోషల్ మీడియా విస్తృతితో సమాచారం విప్లవం వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ, ఏం జరిగినా క్షణాల్లో చేతిలో వాలిపోతోన్న రోజులివీ. అయితే నెట్టింట వైరల్ అయ్యే విషయాలన్నీ నిజమేనా.? అంటే కచ్చితంగా అవుననే సమాధానం చెప్పలేము. తాజాగా ఇలాంటి ఓ వార్తే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్.? ఇందులో ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
07:22 PM (IST) Apr 29
మ్యూచువల్ ఫండ్స్ అనేవి రోజువారీ పెట్టుబడిదారులకు శక్తివంతమైన మరియు అందుబాటులో ఉండే ఎంపిక. ముఖ్యంగా డిజిటల్ MF కాలిక్యులేటర్‌తో కలిపి ఉపయోగించినప్పుడు ఈ కలయిక మీ ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేయడంలో, కట్టుబడి ఉండటంలో మరియు ట్రాక్‌లో ఉండటంలో మీకు సహాయపడుతుంది.
పూర్తి కథనం చదవండి06:56 PM (IST) Apr 29
కెనడా ఎన్నికల్లో ఖలిస్తాన్ సానుభూతిపరుడు జగ్మీత్ సింగ్ ఓటమిపాలయ్యాడు. దీంతో భారత్-కెనడా సంబంధాలకు కొత్త మలుపు తిరగనున్నాయి. జగ్మీత్ ఓటమి భారత్‌కు ఎందుకు ఉపశమనమో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి06:54 PM (IST) Apr 29
Google In Vizag: వైజాగ్‌ను అతి త్వరలో ఐటీ హబ్‌గా మార్చేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు విశాఖపట్టణానికి వస్తుండగా.. త్వరలో గూగుల్ సంస్థ రానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించేశారు. ఈ ప్రకటనపై నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. దీంతోపాటు పలు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన విశ్వవిద్యాలయాలను కూడా వైజాగ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
పూర్తి కథనం చదవండి06:32 PM (IST) Apr 29
Aluminum Cookware: కొన్ని తరాలుగా ఎక్కువ శాతం ఇళ్లలో వంటకు అల్యూమినియం పాత్రలే వాడుతున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అల్యూమినియం పాత్రల్లో వంట వండటం వల్ల దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని.. అల్యూమినియం పాత్రల వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి06:30 PM (IST) Apr 29
శోభిత గర్భవతి అని, త్వరలోనే చైతు శోభిత తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పూర్తి కథనం చదవండి06:19 PM (IST) Apr 29
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర భద్రతా బలగాల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
పూర్తి కథనం చదవండి06:07 PM (IST) Apr 29
Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో శంకర్‌కు గాయాలు కాగా.. ఓ చిన్నారి చనిపోయింది. ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు.
పూర్తి కథనం చదవండి05:56 PM (IST) Apr 29
ఆదివారం వచ్చిందంటే చాలు ప్లేట్‌లో చికెన్ ఉండాల్సిందే. వారంలో ఒక్కసారైనా చికెన్ తినే వారు చాలా మంది ఉంటారు. చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ మంచూరియా, చికెన్ బిర్యానీ ఇలా రకరకాల పేర్లతో చికెన్‌ను లొట్టలేసుకొని తింటుంటారు. అయితే చికెన్ అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. తాజాగా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో సంచల విషయాలు వెలుగులోకి వచ్చాయి.
05:56 PM (IST) Apr 29
BSNL 4G tower location: కారు, బండి పనిచేయకపోయినా ఉండగలం కాని.. ఇప్పుడు ఒక గంట సెల్ ఫోన్ పనిచేయకపోతే మన ప్రపంచం ఆగిపోతుంది కదా.. మీ ప్రాంతంలో సిగ్నల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయో? వీక్ గా ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? అందుకే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL మీ ప్రాంతంలో 4G టవర్ ఉందో లేదో మొబైల్ ద్వారా సులభంగా చెక్ చేసుకొనే ఫెసిలిటీని తీసుకొచ్చింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి05:43 PM (IST) Apr 29
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా వీరిలో ఆరుగురు మహారాష్ట్రకు చెందినవారు. మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది పడ్నవిస్ సర్కార్. ఒక్కో కుటుంబానికి ఎంతిస్తున్నారో తెలుసాా?
పూర్తి కథనం చదవండి05:40 PM (IST) Apr 29
చానెల్ కి మొదటి భారతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా అనన్య పాండే తన ఇటాలియన్ యాత్రలో అద్భుతమైన ఫ్యాషన్, సుందరమైన దృశ్యాలు, రుచికరమైన ఆహారంతో అభిమానులను అలరిస్తుంది.
పూర్తి కథనం చదవండి05:33 PM (IST) Apr 29
తెలంగాణ రాష్ట్ర పర్యాటక, యువజనశాఖ కార్యదర్శి పనిచేస్తున్న స్మితా సభర్వాల్ గత కొంతకాలంగా వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. ఆమె బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈక్రమంలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై ఏఐకి చెందిన ఫొటోని షేర్ చేసి వివాదాల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమెను వేరే శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈక్రమంలో మరోసారి ఆమె సంచలన ట్వీట్ చేశారు.
పూర్తి కథనం చదవండి05:29 PM (IST) Apr 29
Hero HF 100: పర్యావరణాన్ని కాపాడే నిబంధనలకు అనుగుణంగా హీరో కంపెనీకి చెందిన HF 100 కొత్త మార్పులతో మార్కెట్ లోకి వచ్చేసింది. తక్కువ బడ్జెట్ లో, చిన్న ఫ్యామిలీ ప్రయాణించడానికి సరిపోయే విధంగా HF 100 కొత్తగా తయారైంది. మరి ధర పెరిగిందా? తగ్గిందా? బైక్ డిజైన్, ఫీచర్ల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:19 PM (IST) Apr 29
ఇషాన్ ఖట్టర్ మరియు భూమి పెడ్నేకర్ జంటగా నటించిన రాయల్ రొమాంటిక్ కామెడీ 'ది రాయల్స్' త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వినోదభరిత ప్రేమకథ ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి
05:15 PM (IST) Apr 29
కశ్మీర్‌లో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉండటంతో పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. పహల్గాం దాడి నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.
పూర్తి కథనం చదవండి04:54 PM (IST) Apr 29
atal pension yojana: భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడే పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అలాంటి బెస్ట్ పెన్షన్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అటల్ పెన్షన్ యోజన పేరుతో అమలు చేస్తున్న ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండి04:40 PM (IST) Apr 29
Miss World event in Hyderabad: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్దమైంది. ప్రపంచ స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పోటీలు జరిగే ప్రాంతంలోనే కాకుండా.. భాగ్యనగరంలోని పలు కీలక ప్రాంతాల్లో థీమ్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, ఎల్‌ఈడీ విద్యుద్దీపాలతో ప్రపంచ సుందరి కిరీటం నమూనాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పూర్తి కథనం చదవండి04:36 PM (IST) Apr 29
ప్రముఖ ఎలక్ట్రానిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా కస్టమర్లను ఆకర్షించే క్రమంలో సరికొత్త ఆఫర్లను పరిచయం చేస్తోంది. ప్రతీ ప్రత్యేక సందర్భంలో ఆఫర్లను అందిస్తూ వస్తున్న ఓలా తాజాగా అక్షయ తృతీయను పురస్కరించుకొని కొత్త ఆఫర్‌ను అందిస్తున్నారు. ఇంతకీ ఏంటా ఆఫర్.? ఎప్పటి వరకు అందుబాటులో ఉండనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
04:23 PM (IST) Apr 29
కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై ఆంక్షలు విధించిన భారత్, పాక్ పౌరుల వీసాలు రద్దు చేసింది. ఏప్రిల్ 29 లోపు దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది. దీంతో ఇప్పటివరకు ఎంతమంది భారత్ ను వీడారో తెలుసా?
పూర్తి కథనం చదవండి04:20 PM (IST) Apr 29
Indian Railways: ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నారా? అయితే మే 1 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త రూల్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రైల్వే టికెట్ బుకింగ్‌లోనే కీలకమైన మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి03:41 PM (IST) Apr 29
ప్రభుదేవా మొదటి భార్య రంలత్ ఒక పాత ఇంటర్వ్యూలో నటి నయనతారను తీవ్రంగా విమర్శించిన వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి03:36 PM (IST) Apr 29
కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టేందుకు సర్వం సిద్దమైంది... ఎన్నికల ఫలితాల్లో లిబరల్ పార్టీ గెలిచింది. దీంతో ఇండియా-కెనడా సంబంధాలు మెరుగవ్వొచ్చని ఆశలు చిగురించాయి. ట్రూడో హయాంలో దెబ్బతిన్న బంధాన్ని కార్నీ బాగుచేస్తారని భావిస్తున్నారు.
పూర్తి కథనం చదవండి03:28 PM (IST) Apr 29
కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక, లిబరల్ పార్టీ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా మోదీ పలు విషయాలను పంచుకున్నారు..
పూర్తి కథనం చదవండి03:23 PM (IST) Apr 29
72nd Miss World: అందమైన భామలు.. లేతమెరుపు తీగలు.. హైదరాబాద్‌కి వచ్చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముద్దుగుమ్మలు.. మే 6 నుంచి హైదరాబాద్‌లో సందడి చేయనున్నారు. జూన్ 2 వరకు హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తమ అందచందాలతో ఉర్రూతలూగించనున్నారు. మరి ఇలాంటి ఈవెంట్ కండెక్ట్ చేసే సత్తా ఉంటే.. మీకే అవకాశం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
పూర్తి కథనం చదవండి02:39 PM (IST) Apr 29
భారత బ్యాంకింగ్ చరిత్రలో పెద్ద మోసం, రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మోసం కేసులో ప్రధాన నిందితుడైన మేహుల్ చోక్సీ కేసులో మరో మలుపు తిరిగింది. చోక్సీ అరెస్టుపై బెల్జియం కోర్టులో కొనసాగుతున్న విచారణను కోర్టు మళ్లీ వాయిదా వేసింది.
పూర్తి కథనం చదవండి