శోభిత గర్భవతి అని, త్వరలోనే చైతు శోభిత తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వీళ్ళిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం నాగచైతన్య తన కొత్త చిత్రంతో బిజీగా ఉన్నాడు. శోభిత కూడా అప్పుడప్పుడు నటిస్తూనే ఉంది. సమంత నుంచి విడిపోయాక చైతు శోభిత ప్రేమలో పడటం, కొంతకాలం డేటింగ్ చేయడం, ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం నాగచైతన్య శోభిత గురించి ఒక క్రేజీ రూమర్ సోషల్ మీడియాని షేర్ చేస్తోంది.

ప్రస్తుతం శోభిత గర్భవతి అని, త్వరలోనే చైతు శోభిత తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫాన్స్ అయితే అక్కినేని ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు.

అయితే దీనిపై నాగచైతన్య నుంచి కానీ శోభిత నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అక్కినేని ఫ్యామిలీ కూడా స్పందించలేదు. అక్కినేని ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం శోభిత ప్రెగ్నెంట్ కాదని అంటున్నారు.

View post on Instagram
 


చైతు శోభిత ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా నాగచైతన్య సోషల్ మీడియాలో తన పెట్ డాగ్ తో శోభిత రిలాక్స్ అవుతున్న దృశ్యాలని పోస్ట్ చేశారు. శోభితతో పెళ్లి తర్వాత చైతు తండేల్ చిత్రంతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం నాగచైతన్య.. కార్తీక్ దండు దర్శకత్వంలో మైథాలజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. కార్తీక్ దండు చివరగా విరూపాక్ష చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు శోభిత టాలీవుడ్ లో గూఢచారి, మేజర్ చిత్రాలతో పాపులర్ అయింది. బాలీవుడ్ లో ది నైట్ మేనేజర్ లో నటించింది.