పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఉగ్రవాదుల చర్యని, పాకిస్తాన్ తీరుని ఎండగడుతూ దేశ ప్రజలు పలు చోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమాన్ని దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఉగ్రవాదుల చర్యని, పాకిస్తాన్ తీరుని ఎండగడుతూ దేశ ప్రజలు పలు చోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 

ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు తెలుగు వారు కూడా మరణించిన సంగతి తెలిసిందే. రాబోవు రోజుల్లో పహల్గాం దాడికి ఇండియా ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మాత్రం దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

పలు చోట్ల ప్రజలు పాకిస్తాన్ జాతీయ జంటలని రోడ్లపై అంటించి కాళ్లతో తొక్కుతూ నిరసన తెలుపుతున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ఒక యువతి వింతగా ప్రవర్తించి స్థానికుల ఆగ్రహానికి గురైంది. రోడ్డుపై అంటించి ఉన్న పాకిస్తాన్ జెండాని తొలగించి కాళ్లతో తొక్కనివ్వకుండా అడ్డుకుంటోంది. దీనితో స్థానికులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. పాకిస్తాన్ జెండాని తిరిగి రోడ్డుపై అంటించాలని కోరారు. కానీ దానికి ఆమె నిరాకరించింది. 

పాక్ జెండాని రోడ్డుపై నుంచి ఎందుకు తీశావు ? మీరు పాకిస్తాన్ సపోర్టరా అని స్థానికులు ప్రశ్నించారు. తిరిగి పాక్ జెండాని రోడ్డుపై వేయాలని లేకుంటే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని తెలిపారు. అయినా ఆ యువతి నిరాకరించింది. దీనితో ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ యువతిపై దుమ్మెత్తి పోస్తున్నారు. 

Scroll to load tweet…

ఈ వీడియోపై మెగా కోడలు హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందించారు.ఒక వైపు దేశాన్ని రక్షించేందుకు సైనికులు ప్రాణాలకు తెగిస్తున్నారు. మరో వైపు సైనికులకు ప్రజలకు హాని చేసే వారికి ఇలాంటి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి వారిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. దేశం లోపలి నుంచే క్లీనింగ్ మొదలుపెట్టాల్సిన టైం వచ్చింది అంటూ లావణ్య త్రిపాఠి సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లావణ్య త్రిపాఠిని ప్రశంసిస్తూ ఆమెకి మద్దతుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.