MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Automobile
  • Bikes
  • Ola: ఓలా స్కూట‌ర్ల‌పై రూ. 40 వేల డిస్కౌంట్‌.. అక్ష‌య తృతీయ వేళ అదిరిపోయే ఆఫ‌ర్

Ola: ఓలా స్కూట‌ర్ల‌పై రూ. 40 వేల డిస్కౌంట్‌.. అక్ష‌య తృతీయ వేళ అదిరిపోయే ఆఫ‌ర్

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ స్కూట‌ర్ల త‌యారీ సంస్థ ఓలా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలో స‌రికొత్త ఆఫ‌ర్లను ప‌రిచ‌యం చేస్తోంది. ప్ర‌తీ ప్ర‌త్యేక సంద‌ర్భంలో ఆఫ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తున్న ఓలా తాజాగా అక్ష‌య తృతీయ‌ను పుర‌స్క‌రించుకొని కొత్త ఆఫ‌ర్‌ను అందిస్తున్నారు. ఇంత‌కీ ఏంటా ఆఫ‌ర్‌.? ఎప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నుంది.? లాంటి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 29 2025, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ola

Ola

అక్ష‌య తృతీయ‌ను పుర‌స్క‌రించుకొని ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఓలా ప్ర‌త్యేక సేల్‌ను ప్ర‌క‌టించింది. ఓలా ఎస్‌1 వాహ‌నాల‌పై భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. జెన్‌2, జెన్‌3 మోడళ్లపై గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భారీగా డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా మే 30వ తేదీతో ముగియ‌నుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
OLA S1 X

OLA S1 X

ఏ స్కూటీపై ఎంత డిస్కౌంట్ ల‌భించ‌నుందంటే..

* ఓలా జెన్‌2 ఎస్‌1 ఎక్స్‌ 2kWh బ్యాటరీ స్కూట‌ర్ డిస్కౌంట్ త‌ర్వాత రూ. 67,499కి ల‌భిస్తోంది. ఇక 3kWh బ్యాటరీ వేరియంట్ విష‌యానికొస్తే రూ. 83,999, 4kWh బ్యాటరీ ధర రూ.90,999గా నిర్ణ‌యించారు. అదే విధంగా ఎస్‌1 ప్రో ధ‌ర రూ. 1,11,999కి ల‌భిస్తోంది. 

35

* జెన్3 విష‌యానికొస్తే ఎస్‌1 ఎక్స్ రేంజ్ స్కూట‌ర్ల‌లో 2kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.73,999, 3kWh ధర రూ.92,999, 4kWh ధర రూ.1,04,999గా ఉంది. అలాగే ఎస్‌1 ఎక్స్ + 4kWh బ్యాటరీ స్కూటీ ధ‌ర రూ. 1,09,999గా నిర్ణ‌యించారు. 

45

* ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌1 ప్రో+ 4kWh స్కూటర్‌ ధర రూ.1,48,999, 5.3kWh బ్యాటరీ సామర్థ్యం ఉన్న స్కూటర్‌ ధర రూ.1,88,200గా ఉంది. ఎస్‌1 ప్రో 3kWh బ్యాటరీ వేరియంట్‌ ధర రూ.1,12,999, 4kWh బ్యాటరీ వేరియంట్ స్కూట‌ర్ ధ‌ర రూ. 1,29,999కి ల‌భిస్తోంది. 

55

అందుబాటులోకి హైప‌ర్ డెలివ‌రీ సేవ‌లు: 

వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఓలా హైప‌ర్ డెలివ‌రీ సేవ‌ల‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వాహ‌నాలు కొనుగోలు చేసిన రోజే రిజిస్ట్రేష‌న్‌, డెలివరీలను ప్రారంభించింది. ఈ సేవ‌ల‌ను తొలుత బెంగ‌ళూరులో అందుబాటులోకి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో దేశ‌వ్యాప్తంగా ఈ సేవ‌ల‌ను విస్త‌రించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Recommended image2
Simple Wave EV: 243 కిలో మీటర్ల మైలేజ్.. సింపుల్‌ ఎనర్జీ నుంచి అదిరిపోయే స్కూటర్ వచ్చేసింది !
Recommended image3
రివ‌ర్స్ మోడ్‌, ఈజీ పార్క్‌.. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఓలా నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ స్కూటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved