Kitchen tips: పచ్చి మిర్చి కోసిన తర్వాత చేతులు మండకుండా ఉండాలంటే ఇలా చేయండి!
సాధారణంగా పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతులు మంట పుట్టడం సహజం. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ మంటను ఈజీగా తగ్గించవచ్చు. అవెంటో చూసేయండి మరి.
సాధారణంగా పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతులు మంట పుట్టడం సహజం. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ మంటను ఈజీగా తగ్గించవచ్చు. అవెంటో చూసేయండి మరి.
సాధారణంగా మనం పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతుల్లో ఒక విధమైన మంట వస్తుంది. కొందరికి ఈ మంట చాలా తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు కారంగా ఉండే ఆహారాలు తింటే కూడా చేతులు మంటగా అనిపిస్తాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ మంటను ఈజీగా తగ్గించుకోవచ్చు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
మిరపకాయ కోసినా లేదా ఉపయోగించిన తర్వాత మీ చేయి మంటగా ఉండటానికి ప్రధాన కారణం మిరపకాయలో ఉండే కాప్సైసిన్ అనే రసాయనం. వంట చేయడానికి మిరపకాయలు కోసేటప్పుడు, దాని నుంచి కాప్సైసిన్ విడుదల అవుతుంది. ఇది చేతులకు తగలగానే మంటగా అనిపిస్తుంది. కళ్ళు, ముక్కు, నోరు లాంటి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి పచ్చిమిర్చి కోసిన చేతులను ఈ సున్నితమైన భాగాల్లో తాకితే మంట వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మిరపకాయ తాకిన చేతిని ఎప్పుడూ కళ్ళలో పెట్టుకోకూడదు. అది ప్రమాదానికి దారితీస్తుంది. అయితే పచ్చిమిర్చి కోసిన తర్వాత చేతి మంట నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.
పాలు, పెరుగు :
మిరపకాయలు కోసిన తర్వాత చేతుల్లో మంట తగ్గడానికి పాలు లేదా పెరుగును చేతులకు రాసి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయండి. పాలు, పెరుగులో ఉండే ప్రోటీన్ కాప్సైసిన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.
నూనె :
మిరపకాయల్లో ఉండే కాప్సైసిన్ నూనెలో సులభంగా కరిగిపోతుంది. కాబట్టి ఆలివ్ లేదా వెజిటబుల్ ఆయిల్ ను చేతులకు రాసి కాసేపు అలాగే ఉంచి కడగాలి.
ఆల్కహాల్ మిరపకాయల్లో ఉండే కాప్సైసిన్ ను చాలా సులభంగా కరిగిస్తుంది. కాబట్టి మీ దగ్గర ఆల్కహాల్ ఉంటే చేతులకు రాయచ్చు. దీని వల్ల మంట తగ్గుతుంది.
బేకింగ్ సోడా :
మిరపకాయల వల్ల వచ్చే మంటను తగ్గించడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. దీని కోసం బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా తయారు చేసి, దాన్ని చేతులకు రాసి ఆరిన తర్వాత సబ్బుతో కడగాలి.
వెనిగర్ ;
వెనిగర్ లో ఉండే ఆమ్లత్వం కాప్సైసిన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని చేతులకు రాసి కాసేపు అలాగే ఉంచి, తర్వాత సబ్బుతో చేతులు కడగాలి.
మిరపకాయలు కోసేటప్పుడు చేతి తొడుగులు ఉపయోగించండి. మిరపకాయలు కోసిన తర్వాత చేతులు కడగకుండా ఎప్పుడూ కళ్ళ దగ్గర పెట్టుకోకండి. కొన్ని చిట్కాలు కొందరికి పడకపోవచ్చు. వాటివల్ల కొన్నిసార్లు చేతుల్లో బొబ్బలు, నొప్పి రావచ్చు. అలాంటి టైంలో డాక్టర్ ను సంప్రదించడం మంచిది.