Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో చిరస్థాయిగా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయే చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ చిత్రం 1991లో విడుదలయింది. దాదాపు 34 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. రీ రిలీజ్ కి కూడా ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Balakrishna
ఆ సమయంలో లారీ డ్రైవర్, నారీ నారీ నడుమ మురారి లాంటి చిత్రాలు చేస్తున్నాను. కానీ ప్రేక్షకులకు కొత్తదనం అందించాలని కోరుకున్నట్లు బాలయ్య తెలిపారు. అప్పుడే తన వద్దకి ఆదిత్య 369 చిత్రం నా దగ్గరకి వచ్చింది. సింగీతం శ్రీనివాసరావుపై నమ్మకంతో ఈ చిత్రం చేసినట్లు బాలయ్య తెలిపారు. ఎందుకంటే ఇది తొలి టైం ట్రావెల్ మూవీ. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వెన్నెముకగా నిలిచారు. నాన్నగారి సినిమాలు చూశాను. కాబట్టి శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర నాకు కొట్టిన పిండి అనిపించింది.
అప్పటి జనరేషన్ కి ఆదిత్య 369 చిత్రం చాలా అడ్వాన్డ్ మూవీ. అన్ స్టాపబుల్ షో ద్వారా, సినిమాల ద్వారా నేను రెండు జనరేషన్స్ కి కనెక్ట్ అయ్యాను. ఇప్పటి తరం పిల్లలు ఆదిత్య 369 చిత్రం చూడాలి. తప్ప కూడా ఎంజాయ్ చేస్తారు అని బాలకృష్ణ తెలిపారు.
Balakrishna
పద్మభూషబ్ అవార్డుపై కూడా బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మభూషణ్ నాకు లేటుగా ఇచ్చారని కొంతమంది అంటున్నారు. కాదు.. కరెక్ట్ టైంకే ఇచ్చారు అని బాలయ్య తెలిపారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనే మాట మన వంటబట్టదు. వరుసగా నాలుగు హిట్లు వచ్చాయి. మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచా. అన్ స్టాపబుల్ షో చేస్తున్నా. క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అని బాలయ్య అన్నారు. ఈ చిత్రానికి గుండెకాయ లాంటి పాత్ర శ్రీకృష్ణ దేవరాయలు అని అన్నారు. టైం ట్రావెల్ మూవీస్ లో బెస్ట్ మూవీ ఆదిత్య 369 అని బాలయ్య తెలిపారు.
Aditya 369
ఈ చిత్రంలో నటించిన నటీనటుల గురించి మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన హీరో తరుణ్, రాశి గురించి బాలయ్య ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పుడు వాళ్లంతా చిన్న పిల్లలు అని బాలయ్య తెలిపారు. హీరోయిన్ మోహిని అయితే పుస్తకాలు తెచ్చుకుని సెట్స్ లో చదువుకునేది. ఆ అమ్మాయి ఆ టైంలో పరీక్షలకు ప్రిపేర్ అవుతూ నటించింది అని బాలయ్య తెలిపారు.