Food
పనీర్ టిక్కా కబాబ్ చాలా ఫేమస్. పనీర్‌ను మసాలాలు, పెరుగులో నానబెట్టి, తక్కువ మంటపై కాల్చితే స్మోకీ టేస్ట్ వస్తుంది.
వెజిటబుల్ టిక్కా కబాబ్ కూడా ఫంక్షన్స్ లో మంచి ఆప్షన్. రకరకాల కూరగాయల్ని మసాలాలు, పెరుగుతో కలిపి నిప్పుల మీద కాల్చితే అదిరిపోయే రుచి వస్తుంది.
మష్రూమ్ కబాబ్ చాలామందికి ఇష్టమైనది. పుట్టగొడుగు ముక్కల్ని మసాలా పెరుగులో వేస్తారు. బాగా కలిపిన తర్వాత, తక్కువ వేడి మీద కాలుస్తారు. ఆ తర్వాత పచ్చడితో తింటే సూపర్‌గా ఉంటుంది.
ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించడానికి సోయా చాప్ కబాబ్ బెస్ట్. సోయా చాప్‌ను ముందుగా మసాలాల్లో, తర్వాత పెరుగులో ఉంచుతారు. తర్వాత డీప్ ఫ్రై చేసి వడ్డించవచ్చు.
పాలకూర కబాబ్‌లు చేయడం చాలా సులువు. పాలకూరను సన్నగా తరిగి, ఉడికించిన బంగాళదుంపలు, మసాలాలు కలిపి, గుండ్రంగా చేసి వేయించాలి. పచ్చడితో సర్వ్ చేయండి.
క్యారెట్ కబాబ్ చేయడానికి, ముందుగా క్యారెట్‌ను తురుముకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు, బ్రెడ్ క్రంబ్స్ కలపాలి. మసాలాలు వేసి మెత్తగా చేసి చిన్న సైజులో డీప్ ఫ్రై చేయాలి.
క్యాప్సికమ్‌ను సగానికి కట్ చేసి, కూరగాయలు, ఉడికించిన బంగాళదుంపలు, టమోటాలు, మసాలాలు నింపండి. చాట్ మసాలా వేసి ఆ తర్వాత కాల్చండి.