వంట పదార్థాల్లో రసాయన రంగులు, కల్తీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆహార భద్రతా శాఖ, పన్నీర్ ప్రియులకు క్యాన్సర్ హెచ్చరిక చేసింది. బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 163 పన్నీర్ నమూనాలను సేకరించి పరీక్షకు పంపారు.
వంట పదార్థాల్లో రసాయన రంగులు, కల్తీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆహార భద్రతా శాఖ, పన్నీర్ ప్రియులకు క్యాన్సర్ హెచ్చరిక చేసింది. బెంగళూరులోని వివిధ ప్రాంతాల నుంచి 163 పన్నీర్ నమూనాలను సేకరించి పరీక్షకు పంపారు.
వీటిలో 17 నివేదికలు రాగా, నాలుగు నమూనాలు సురక్షితమని తేలాయి. మరో రెండింటిలో హానికరమైన పదార్థాలు ఉన్నాయని తెలిసింది. పన్నీర్ తయారు చేసేటప్పుడు తక్కువ మోతాదులో కాల్షియం, ప్రోటీన్ వాడుతారు. పన్నీర్‌ను మెత్తగా చేయడానికి కెమికల్స్ వాడుతున్నారని సమాచారం. ఈ కెమికల్ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఆహార భద్రతా శాఖ నివేదికలో ఉంది.
ఆరోగ్య సమస్యలు ఏమిటి?: దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కొవ్వు శాతం పెరగడం, కిడ్నీ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆహార భద్రతా శాఖ దీనిపై పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అధికారులు ఆహార పదార్థాల కలరింగ్, కల్తీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. కల్తీ పట్ల జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు, ప్రజలకు సూచిస్తున్నారు. ఇదివరకే ఆహార భద్రతా శాఖ పుచ్చకాయలో కెమికల్, స్వీట్లలో, ఇడ్లీకి వాడే ప్లాస్టిక్‌లో క్యాన్సర్ కారకాలను గుర్తించింది.